జూబ్లీ సొసైటీలో లుకలుకలు

నూతనంగా ఎన్నికై న జూబ్లీ హిల్స్ సొసైటీ పాలక మండలిలో విబేధాలు రచ్చకెక్కాయి. సభ్యులు బాహాబాహీ కి దిగినట్టుగా తెలుస్తోంది. Advertisement సొసైటీ అధ్యక్షుడు ఇంకా కొందరు సభ్యుల పై కార్యదర్శి మురళీ ముకుంద్…

నూతనంగా ఎన్నికై న జూబ్లీ హిల్స్ సొసైటీ పాలక మండలిలో విబేధాలు రచ్చకెక్కాయి. సభ్యులు బాహాబాహీ కి దిగినట్టుగా తెలుస్తోంది.

సొసైటీ అధ్యక్షుడు ఇంకా కొందరు సభ్యుల పై కార్యదర్శి మురళీ ముకుంద్ పోలీసులుకు ఫిర్యాదు చేసారు. 

సొసైటీ బై లాస్ ప్రకారం సెక్రటరీ అయిన తాను రికార్డులను నిర్వహించాల్సి వుంటుందని ఎప్పుడు ఎవరికీ ఏ రికార్డు  అవసరం వచ్చినా తన సమక్షం లోనే రికార్డులు చూడటానికి సభ్యులకు అధికారం ఉంది తప్ప మరో విధంగా లేదని ఆయన వెల్లడించారు.  

కానీ నిబంధనలకు విరుద్ధంగా, రికార్డు రూమ్ తాళాలు ఇవ్వాల్సిందిగా సొసైటీ అధ్యక్షుడు ఇంకా మరి కొందరు సభ్యులు తనను రెండు గంటల పాటు నిర్భంధించారని, తన పైన దౌర్జన్యం చేసారనీ, కార్యదర్శి మురళి ముకుంద్ అటు పోలీసులకు ఇటు సహకార సంఘాల రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.