కాటమరాయుడు మ్యాజిక్ వన్స్ మోర్

త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది ఇప్పటికీ అభిమానులకు, సినిమా లవర్స్ కు ఓ సూపర్ సినిమానే. ఈ సినిమాలో కాటమరాయుడా కదిరి నరసింహుడా పాట ఓ సెన్సేషన్. పవన్ కు ఇష్టమైన ఫోక్…

త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది ఇప్పటికీ అభిమానులకు, సినిమా లవర్స్ కు ఓ సూపర్ సినిమానే. ఈ సినిమాలో కాటమరాయుడా కదిరి నరసింహుడా పాట ఓ సెన్సేషన్. పవన్ కు ఇష్టమైన ఫోక్ స్టయిల్ లో సాగే ఈపాట ఎంత పాపులర్ అంటే ఆ పాట మకుటంతో పవన్ ఓ సినిమానే చేసేంత.

ఇప్పుడు ఆ మ్యాజిక్ ను తివిక్రమ్ రిపీట్ చేయబోతున్నారట. ప్రస్తుతం పవన్ తో చేస్తున్న సినిమాలో ఇలాంటి సాంగ్ పెట్టేందుకు ఓ మాంచి ఫోక్ ట్యూన్ చేయించారట. అది సూపర్ గా వచ్చిందని వినికిడి. సంగీత దర్శకుడు అనిరుధ్ చేత మాంచి ఫోక్ ట్యూన్ చేయించుకున్నారట త్రివిక్రమ్. 

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. కథ ప్రకారం సాఫ్ట్ వేర్ కంపెనీ, అందులో పవన్ వుండే సీన్లు షూట్ చేస్తున్నారు. సినిమా అవుట్ అండ్ అవుట్ హిల్లేరియస్ గా వస్తోందని వినికిడి.