కేశవ సినిమా విడుదల మరో రెండు వారాల్లో వుంది. ఈ సినిమాతో డైరక్టర్ సుధీర్ వర్మ భవిష్యత్ తేలిపోతుంది. తొలి సినిమా స్వామిరారాతో ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చారు సుధీర్ వర్మ. అయితే ఆ బజ్ అంతా ఒక్క సినిమాతో మాటాష్ అయిపోయింది.. దోచేయ్ సినిమా ఫలితం అలాంటిది. అయితే నిఖిల్ హిట్ ల పుణ్యమా అని, కేశవ సినిమాను ఏడు కోట్లలో తీసేసి, ఇరవై కోట్లకు అమ్మగలిగారు.
ఇప్పుడు ఆ సినిమా టాక్ మీద బయ్యర్లు తెగ ఆరా తీస్తున్నారు. అడ్వాన్స్ లు ఇచ్చేసారు. సినిమా ఎలా వస్తోందో అని టెన్షన్. సినిమా ఆర్ ఆర్ స్టేజ్ లో వుంది. ఎడిటింగ్ టేబుల్ మీద పని పూర్తయితే టాక్ బయటకు వస్తుంది. మరోపక్కే సితార ఎంటర్ టైన్ మెంట్స్ సుధీర్ వర్మతో సినిమా చేయాలనుకుంటోందు. అడ్వాన్స్ ఎప్పడో ఇచ్చేసారు. అయితే సినిమా చేస్తారా? చేయరా? అన్నది కేశవ ఫలితంపైన ఆధారపడి వుంటుంది.
కేశవ కాస్త టిపికల్ సబ్జెక్ట్ సినిమా. ఎడం పక్క వుండాల్సిన గుండె కుడిపక్క వుండడం, దాని బీట్ పరిథి దాటాకుండా వుండాలి. అలా చూసుకుంటూ తల్లితండ్రులను చంపిన వాళ్లను చంపాలి. దీనితో ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతే సినిమా సూపరే. అప్పుడు సుధీర్ వర్మకు మళ్లీ సినిమా వస్తుంది. లేదూ అంటేనే వస్తుంది సమస్య. నిఖిల్ కు కాదు, సుధీర్ వర్మకు.