‘ఖైదీ’లో ‘మగధీర’

రామ్ చరణ్ మగధీర సినిమాలో చిన్న స్టెప్ వేసి, తళక్కున మెరిసారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు అందుకు బాకీ తీర్చేసుకుంటున్నాడు రామ్ చరణ్. తన తండ్రి ఖైదీ నెంబర్ 150 సినిమా కోసం రామ్…

రామ్ చరణ్ మగధీర సినిమాలో చిన్న స్టెప్ వేసి, తళక్కున మెరిసారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు అందుకు బాకీ తీర్చేసుకుంటున్నాడు రామ్ చరణ్. తన తండ్రి ఖైదీ నెంబర్ 150 సినిమా కోసం రామ్ చరణ్ చిన్న స్టెప్ వేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే అది సినిమాలో పాటలోనా, లేదా సినిమా ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా తయారుచేసే సాంగ్ లోనా అన్నది ఇంకా తెలియడం లేదు.

అయితే ఖైదీకి సంబంధించి చరణ్ డ్యాన్స్ బిట్ అన్నది మాత్రం పక్కా అని తెలుస్తోంది. బహుశా సినిమాలోనే ఏదో ఒక పాట సందర్భంగానే చరణ్ కనిపించి, చిన్న స్టెప్ వేసే అవకాశం వుంది. 

ఖైదీ నెంబర్ 150 సినిమాకు మాగ్జిమమ్ బజ్ తీసుకురావడానికి చిరు అండ్ కో కిందా మీదా అవుతున్నారు. అందులో భాగంగా ఒక్కో పాయింట్ జోడించుకు వస్తున్నారు. అందులో రామ్ చరణ్ డ్యాన్స్ బిట్ కూడా ఒకటి అని తెలుస్తోంది.