సాధారణంగా ఏ సినిమాకైనా ఓ టీమ్ పనిచేస్తుంటుంది. ఆ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు మీడియాలోకి వదిలేందుకు కిందా మీదా అవుతుంటుంది. కానీ గౌతమీ పుత్ర శాతకర్ణికి రెండు టీమ్ లు తెరవెనుక పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. శాతకర్ణిని బాలయ్య సినిమాగా, బాలయ్య అభిమానుల హవా, ఇలా వార్తలు బయటకు వచ్చేలా ఓ టీమ్ పనిచేస్తోంది. కానీ తెరవెనుక మరో టీమ్ కూడా పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు సినిమా అంతా క్రిష్ దే, క్రెడిట్ అంతా క్రిష్ దే, ఇన్ టైమ్ లో ఫినిష్ చేసిన ఘనత క్రిష్ దే, ఇలా రకరకాలుగా క్రిష్ ను ఎలివేట్ చేయడానికి ఆ టీమ్ తెగ ఫీలర్లు వదులుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి హీరో కోపరేట్ చేయకపోతే డైరక్టర్ ఇన్ టైమ్ లో సినిమా ఫినిష్ చేయగలడా? అసలు క్రిష్ కు సినిమా ఇచ్చింది బాలయ్య కదా? బాలయ్య లేకుండా క్రిష్ ఈ ప్రాజెక్టు అసలు తెరకెక్కించగలడా? ఇప్పటిదాకా ఇంతటి బజ్ వచ్చిన సినిమాలు క్రిష్ కు వున్నాయా? అన్న ప్రశ్నలు బాలయ్య ఫ్యాన్స్ లో వినిపిస్తున్నాయి.
సినిమాకు మాగ్జిమమ్ బజ్ తీసుకురావడానికి బాలయ్య ఫ్యాన్స్ తెగ వర్క్ చేస్తున్నారు. కానీ క్రిష్ టీమ్ మాత్రం, టోటల్ క్రెడిట్ ను క్రిష్ ఖాతాలో వేయడానికి వ్యూహాలు రచిస్తోందని ఇండస్ట్రీ టాక్. ఈ విషయాన్ని బాలయ్య దృష్టికి కూడా తీసుకెళ్లారని, సినిమా విడుదలయ్యేదాకా ఏమీ డిస్కషన్ లు వద్దని అభిమానులకు బాలయ్య సమాచారం అందించాడని అంటున్నారు.
బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా విషయంలో కూడా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ క్రిష్ కే అప్పగించేసాడని మీడియాలో వార్తలు వెలువడ్డం వెనుక కూడా క్రిష్ టీమ్ వుందని టాక్. ఇలా శాతకర్ణి విషయంలో బాలయ్య కన్నా క్రిష్ నే హైలైట్ చేసేందుకు తెగ వార్తలు పుట్టిస్తున్నారని అభిమానులు ఫీలవుతున్నారట. ఇంతవరకు ఎక్కడా బాలయ్య బాగా చేసాడని కానీ, బాలయ్య ఫలానా సీన్ భలే పండించాడని కానీ, ఎక్కడా బ్రేక్ లేకుండా షూట్ పూర్తి చేసేందుకు సహకరించాడని కానీ వార్తలు రాకపోవడం చూస్తుంటే అభిమానుల మాట నిజమే అనిపిస్తోంది.
ఏదైనా తన పీఆర్ టీమ్ తో తనకు అనుకూలంగా సైలెంట్ గా ప్రచారం జరిపించుకోవడంలో క్రిష్ బాగానే విజయం సాధించినట్లు కనిపిస్తోంది. పలు మీడియాల్లో క్రిష్ కు పరిచయాలు బాగా వుండడం కూడా ఇందుకు సహకరిస్తున్నట్లుంది.