సుకుమార్ ఎంత క్లాస్ డైరక్టర్ నో, ఆయన సినిమాలో అయిటమ్ సాంగ్ లు అంత పరమ నాటుగా వుంటాయి. పక్కాగా విలేజ్ లెవెల్ అయిటమ్ సాంగ్ లనే ఆయన ఆ సినిమా లెవెల్ కు తీసుకెళ్తారు.
100%లవ్ లాంటి సినిమాలో కూడా బూతులు నిండిన అయిటమ్ సాంగ్ కూరేయడం ఆయన స్పెషాలిటీ. ఆ సినిమానే కాదు. ఆయన సినిమాలు అన్నింటిలో తన సన్నిహితుడు దేవీశ్రీప్రసాద్ తో కలిసి, అలాంటి అయిటమ్ సాంగ్ లే చేయించుకున్నారు.
మరి ఇప్పుడు ఆయన అచ్చమైన గోదావరి పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో 1985 ల నాటి సన్నివేశాలను ప్రతిబింబిస్తూ మెగా హీరోరామ్ చరణ్ తో రంగస్థలం 1985 సినిమా తీస్తున్నారు.
ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో భోగం మేళాలు ఫేమస్. పెళ్లి అన్నా, ఉత్సవం అన్నా, లేదా నలుగురు కలిసినా భోగం మేళం ఆడాల్సిందే. ఆ మాటకు వస్తే, సుకుమార్ సినిమాల్లో అయిటమ్ సాంగ్ లకు ఈ భోగం మేళాలే ప్రేరణ అని తెలుస్తూనే వుంటుంది.
ఇంతకీ లేటెస్ట్ విషయం ఏమిటంటే, రంగస్థలం 1985 సినిమాలో భోగం మేళం టైపు అయిటమ్ సాంగ్ ను చూపిస్తారని తెలుస్తోంది. ఎలాగూ సినిమా అన్నాక అయిటమ్ సాంగ్ తప్పదు.
సినిమా నేపథ్యం అదయనపుడు ఇక ఆ కాలంలోని అయిటమ్ ల సాంగ్ టైపు భోగం మేళంనే పెడితే పోలా అని సుకుమార్ యోచిస్తున్నట్లు బోగట్టా. ఈ పాట కోసం ఇద్దరు ముగ్గరు కొత్త అయిటమ్ పాపల కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది.