లెజెండ్‌లో బాలయ్య అవతారాలెన్ని?

బాలయ్య బాబుకి గెటప్పుల మోజు ఇంకా తీరలేదు. అధినాయకుడులో మూడు అవతారాల్లో కనిపించాడు బాలకృష్ణ. శ్రీమన్నారాయణలోనూ చాలా గెటప్పులు మార్చాడు. ప్రతీ సినిమాలోనూ ఏదో ఓ అవతారంలో కనిపించడం బాలయ్య స్టైల్‌. Advertisement  ఇప్పుడు…

బాలయ్య బాబుకి గెటప్పుల మోజు ఇంకా తీరలేదు. అధినాయకుడులో మూడు అవతారాల్లో కనిపించాడు బాలకృష్ణ. శ్రీమన్నారాయణలోనూ చాలా గెటప్పులు మార్చాడు. ప్రతీ సినిమాలోనూ ఏదో ఓ అవతారంలో కనిపించడం బాలయ్య స్టైల్‌.

 ఇప్పుడు లెజెండ్‌లోనూ ఇదే బాటలో నడవబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో బాలయ్య మూడు గెటప్పుల్లో కనిపిస్తాడని సమాచారమ్‌. విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌ ప్రకారం.. లెజెండ్‌ మూడు తరాల కథ. ఒకొక్క తరంలో బాలయ్య ఒక్కో అవతారంలో కనిపిస్తాడట. బాలకృష్ణ పాత్ర ఒక్కటే. కానీ వయసు రీత్యా అతని గెటప్‌ మారుతూ వస్తుంది.

 ఇరవై ఏళ్ల కుర్రాడిగా, పాతికేళ్ల మధ్య వయస్కుడిగా, అరవై ఏళ్ల వృద్ధుడిగా ఇలా మూడు వేషధారణల్లో బాలయ్య కనిపిస్తాడని సమాచారమ్‌. ఒకొక్క గెటప్‌ ని తీర్చిదిద్దడానికి బోయపాటి శ్రీను చాలా జాగ్రత్తలు తీసుకొన్నాడట. మరి బాలకృష్ణని ఏ విధంగా చూపించాడో తెలియాలంటే లెజెండ్‌ వచ్చే వరకూ ఆగాల్సిందే.