బాలయ్య ముహూర్తం ఫిక్స్ చేశాడు. 28వ తేదీ సరిగ్గా 10 గంటల 34 నిమిషాలకు థియేటర్లో `లెజెండ్` మెయిన్ షో పడాలని ఆర్డర్ జారీ చేశాడు. అయితే… ఇంకా సినిమా మాత్రం రెడీ కాలేదు. దీంతో అనుకొన్న సమయానికి లెజెండ్ ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.
ఫస్ట్‌కాపీ సిద్ధం చేయకముందే నిర్మాతలు సెన్సార్‌కి అప్లై చేశారట. అయితే… సెన్సార్ బోర్డు మాత్రం ఆ అప్లికేషన్ని తిరస్కరించినట్టు సమాచారం. ఫస్ట్‌కాపీ తీసుకొచ్చి పెట్టాకే… సెన్సార్‌కి అప్లై చేయాలనీ, ఆ తర్వాతే మేం డేట్ ఇస్తామని చెబుతున్నారట.
దీంతో చిత్రబృందం రేయింబవళ్లు కష్టపడుతోందని తెలుస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఆలస్యం వల్లే ఇలా జరిగిందట. పరిస్థితి చూస్తుంటే సినిమాని 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా లేదని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో బాలయ్య దర్శకనిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఏం చేస్తారో నాకు తెలియదు సినిమా మాత్రం నా ముహూర్తం మేరకే థియేటర్లో పడాలని చెబుతున్నాడట.