మళ్లీ ఆ మ్యూజిక్ మ్యాజిక్?

దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలు అంటే కచ్చితంగా అడియో బాగుంటుంది. నిన్న మొన్నటి అరవింద సమేత కూడా అదే ప్రూవ్ చేసింది. అ.. ఆ, అజ్ఞాతవాసి కూడా. అయితే అత్తారింటికి దారేది, జల్సా, జులాయి, సన్నాఫ్…

దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలు అంటే కచ్చితంగా అడియో బాగుంటుంది. నిన్న మొన్నటి అరవింద సమేత కూడా అదే ప్రూవ్ చేసింది. అ.. ఆ, అజ్ఞాతవాసి కూడా. అయితే అత్తారింటికి దారేది, జల్సా, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వీటి మ్యాజిక్ వేరు. దేవీశ్రీప్రసాద్-తివిక్రమ్ కాంబినేషన్ అలాంటిది.

కానీ ఎందుకునో మూడు సినిమాల నుంచి ఆ కాంబిషన్ సెట్ కాలేదు. అ.. ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత సినిమాలు దేవీ చేయలేదు. లేటెస్ట్ గా మళ్లీ బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయింది. ఈ సినిమాకు మ్యూజిక్ కు దేవీశ్రీప్రసాద్ ను తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో దేవీశ్రీప్రసాద్ మంచి అల్బమ్ లు ఇవ్వలేదు. భరత్ అనే నేను, రంగస్థలం తరువాత అన్నీ ఫెయిల్. అందుకే దేవీశ్రీని తీసుకోవడమా? అరవింద సమేతకు మాంచి మ్యూజిక్ ఇచ్చిన థమన్ ను తీసుకోవడమా? అన్న డైలామాలో త్రివిక్రమ్ వున్నట్లు తెలుస్తోంది.

బన్నీకి కూడా ఓ మాంచి హిట్, మాంచి ఆల్బమ్ కావాలి. అందుకే మ్యూజిక్ డైరక్టర్ విషయంలో కాస్త ఆచితూచి నిర్ణయం తీసుకోవడం కోసం సమాలోచనలు సాగుతున్నాయి.

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

కేసీఆర్ ఫ్రంట్ ఇక అంతేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్