మనం సినిమా విడుదలైంది. పాజిటిక్ టాక్ తెచ్చుకుంది. అది ఓకె. కానీ సినిమా సంగతులు సదా తెలుసుకునే జనాలు మాత్రం మనం సినిమా చూసి, ఇది నాగ్ కథే అంటున్నారు. అదెలా అంటే ఇలా అంటున్నారు.
నాగ్ కు ముందు అరేంజ్డ్ మ్యారేజీ జరిగింది. అదెందుకు విఫలమైందో, అయింది. నాగ్ కు కాస్త ప్లేబాయ్ లక్షణాలున్నాయని అంటారు. టబు, అనుష్క వంటివారితో ముడిపెడతారు. ఇందులో సమంత-నాగచైతన్య క్యారెక్టర్లు నాగార్జున తొలి లైఫ్ కు ప్రతిబింబాలుగా వుంటాయి. నాగచైతన్య క్యారెక్టర్ లో ఆ ప్లేబాయ్ లక్షణాలు కొంచెం కనిపిస్తాయి.
ఇక సినిమాలో రెండో కథ. నాగార్జున-అమలది ప్రేమ వివాహం. ఇద్దరి ప్రేమ ఈ నాటికి చెక్కుచెదరకుండా నిలిచి వుంది. నాగ్ ఈ పెళ్లి చేసుకునే వేళకి, అతగాడి రేంజ్ తో పోల్చుకుంటే అమల రేంజ్ తక్కువే. సినిమాలో నాగ్ – శ్రియల క్యారెక్టర్ లు కూడా అంతే. ఆ పాత్రల లక్షణాలు, వీరి లక్షణాలు కూడా సరిపోతాయి.
పైగా సినిమాలో రెండు జంటలు ఒక్కో కొడుకు మాత్రం వుంటారు. నాగ్ కు రెండు వివాహాలకు ఇద్దరు కొడుకులున్న సంగతి తెలిసిందే. మొత్తానికి విక్రం కుమార్ తెలివిగా నాగ్ జీవితంలోంచే కథ అల్లి, నాగ్ ను ఒప్పించి, నాగ్ తో సినిమా తీసాడన్నమాట. గట్టివాడే.