మంచు సినిమాలో మంచి రీమిక్స్

మామ మంచు..అల్లుడు కంచు అంటూ భలే టైటిల్ ఫిక్స్ చేసాడు డైరక్టర్ శ్రీనివాసరెడ్డి. టాటా బిర్లా మధ్యలో లైలా, చందన బ్రదర్స్ బొమ్మన సిస్టర్స్ అంటూ భలే టైటిళ్లు పెట్టడం అలవాటే ఆయనకు. ఇప్పుడు…

మామ మంచు..అల్లుడు కంచు అంటూ భలే టైటిల్ ఫిక్స్ చేసాడు డైరక్టర్ శ్రీనివాసరెడ్డి. టాటా బిర్లా మధ్యలో లైలా, చందన బ్రదర్స్ బొమ్మన సిస్టర్స్ అంటూ భలే టైటిళ్లు పెట్టడం అలవాటే ఆయనకు. ఇప్పుడు ఈ మంచు కంచు సినిమా మోహన్ బాబు, అల్లరి నరేష్ ల కోసం.

పైగా అలనాటి హీరోయిన్లు రమ్యకృష్ణ, మీనాలను తీసుకువచ్చి మోహన్ బాబుకు జోడీగా వుంచాడు. వెంటనే అల్లరి మొగుడు కాంబినేషన్ ఎలాగూ గుర్తుకు వస్తుంది. అందుకే అందులోని మాంచి హిట్ సాంగ్ ను కూడా ఈ సినిమాలో రీమిక్స్ చేసి, ఫిక్స్ చేయాలనుకుంటున్నాడట.

ఈ మధ్య మంచువారి సినిమాలకు ఇద్దరు ముగ్గురు సంగీతం అందించడం కామన్. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అచ్చు, బప్పీలహరి, రఘు కుంచె తలా ఒకటో, రెండో పాటలు చేస్తున్నారు. దానికి తోడు ఈ కీరవాణి పాట మిక్స్ అన్నమాట. ఇద్దరు హీరోయిన్ లతో హీరో పాడే పాట ఇది. ముద్దింమందీ ఓ చామంతీ అంటూ.