Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మార్చిలో థియేటర్లు బంద్?

మార్చిలో థియేటర్లు బంద్?

నిన్నటి వరకు థియేటర్లు ఆ నలుగురు చేతిలో వున్నాయి. థియేటర్ల మీద భయంకరంగా ఆర్జించేస్తున్నారు. చిన్న సినిమాలకు థియేటర్లు లేవు. ఇలా రకరకాల మాటలు వినిపించేవి. కానీ ఇప్పుడు గ్రౌండ్ రియాల్టీ వేరుగా వుంది. థియేటర్లు లీజుకు తీసుకున్నవారు కష్టాలు పడుతున్నారు. ఇది పచ్చినిజం. 

ఎంత పచ్చినిజం అంటే సురేష్ బాబు-ఎన్వీ ప్రసాద్ కలిపి సీడెడ్ లో నిర్వహిస్తున్న థియేటర్ల సంఖ్య గత ఒకటి రెండేళ్లలో నాలుగోవంతుకు వచ్చేసింది. ఇంకా థియేటర్లు తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఎక్కడ థియేటర్లు వర్క్ అవుట్ అవుతున్నాయో అవి వుంచుకుని, మిగిలినవి వదలించుకుంటున్నారు. 

రాను రాను టాలీవుడ్ లో ఆరేడు నెలలు థియేటర్లు ఫీడ్ చేయడం కష్టంగా మారుతోంది. సంక్రాంతి ముందు రెండునెలల పాటు థియేటర్లు వెలవెల బోయాయి. వాటి నిర్వహణే కష్టం అయింది. ఇప్పుడు మళ్లీ సంక్రాంతి తరువాత అదే పరిస్థితి వచ్చేసింది. మార్చినెల కూడా ఇదే పరిస్థితి కొనసాగేలా వుంది. 

ఇదిలావుంటే నైజాంలో ఇంకో సమస్య వుంది. అక్కడ మల్టీ ఫ్లెక్స్ ల్లో పార్కింగ్ ఫీజులను తెలంగాణ ప్రభుత్వం రద్దుచేసింది. దాంతో ఆ ఆదాయం కూడా పడిపోయింది. ఇలాంటి టైమ్ లో మార్చిలో థియేటర్లు బంద్ చేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన ఇప్పుడు నైజాం థియేటర్ల  లీజుదారులు, ఓనర్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆంధ్రలో కొన్నిచోట్ల, ఒక్కోసారి, ఒక్కో థియేటర్ సినిమాలు లేక, కలెక్షన్లు లేక షోలు క్యాన్సిల్ చేస్తున్న సిట్యువేషన్  వుంది. అయితే బంద్ అన్న ఆలోచన ఆంధ్రలో లేదు. నైజాంలో మాత్రం ఆ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్కింగ్ వ్యవహారం మీదనే ఫోకస్ పెట్టి, అదే ప్రధాన డిమాండ్ గా సమ్మెకు థియేటర్లు దిగే అవకాశం వుంది.

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?