మ‌రో ద‌ర్శకుడికి హ్యాండిచ్చిన ప్రిన్స్‌

రౌండ‌ప్ చేసి క‌న్‌ఫ్యూజ్ చేయకండి.. క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఎక్కువ కొట్టేస్తాను – అంటాడు బిజినెస్‌మేన్ లో మ‌హేష్‌బాబు. ఇప్పుడు కూడా మ‌హేష్ క‌న్‌ఫ్యూజ‌న్‌లోనే ఉన్నాడు. ద‌ర్శకులంతా రౌండ‌ప్ చేసి ప్రిన్స్ ని క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప‌డేస్తున్నారు. దాంతో…

రౌండ‌ప్ చేసి క‌న్‌ఫ్యూజ్ చేయకండి.. క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఎక్కువ కొట్టేస్తాను – అంటాడు బిజినెస్‌మేన్ లో మ‌హేష్‌బాబు. ఇప్పుడు కూడా మ‌హేష్ క‌న్‌ఫ్యూజ‌న్‌లోనే ఉన్నాడు. ద‌ర్శకులంతా రౌండ‌ప్ చేసి ప్రిన్స్ ని క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప‌డేస్తున్నారు. దాంతో ఎవ‌రితో సినిమా చేయాలో తెలీక తిక‌మ‌క ప‌డుతున్నాడు. దాంతో మ‌రో ద‌ర్శకుడికి హ్యాండివ్వాల్సివ‌చ్చింది. 

మిర్చి త‌ర‌వాత కొర‌టాల శివ మ‌రో సినిమా చేయ‌కుండా మ‌హేష్ కోసం కాపుకాచుకొని కూర్చున్నాడు. ఈ సినిమా జూన్‌లో మొద‌లుకావాలి. కానీ ఇప్పుడు మ‌హేష్ త‌న నిర్ణ‌యం మార్చుకొన్నాడు. ఆగ‌డు త‌ర‌వాత నేరుగా పూరితో ఓ సినిమా చేయాల‌ని డిసైడ్ అయ్యాడు. 

దాంతో కొర‌టాల ఇంకొంత కాలం ఆగాల్సిన పరిస్థితి. పూరి సినిమాతో పాటు కొర‌టాల శివ సినిమా కూడా స‌మాంత‌రంగా చేయొచ్చు క‌దా.. అంటే మ‌హేష్ దానికీ సిద్ధంగా లేడ‌ట‌. మ‌రి కొర‌టాల ఇంకొంత‌కాలం ఆగుతాడో, లేదంటే మ‌రో హీరోని వెతుక్కుంటాడో..??