అన్నగారిని గుర్తు చేస్తాడా?

మోహ‌న్‌బాబుకి అన్నగారు… నంద‌మూరి తార‌క‌రామారావు అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పన‌వ‌స‌రం లేదు. నా గురువు – దైవం అంటూ వీలున్నప్పుడ‌ల్లా ఆ పెద్దాయ‌న్ని గుర్తుచేసుకొంటూనే ఉంటాడు. మ‌రోసారి అన్న పేరుని గుర్తుచేస్తున్నాడు మోహ‌న్‌బాబు. మంచు…

మోహ‌న్‌బాబుకి అన్నగారు… నంద‌మూరి తార‌క‌రామారావు అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పన‌వ‌స‌రం లేదు. నా గురువు – దైవం అంటూ వీలున్నప్పుడ‌ల్లా ఆ పెద్దాయ‌న్ని గుర్తుచేసుకొంటూనే ఉంటాడు. మ‌రోసారి అన్న పేరుని గుర్తుచేస్తున్నాడు మోహ‌న్‌బాబు. మంచు మోహ‌న్‌బాబు, విష్ణు క‌థానాయ‌కులుగా రాంగోపాల్‌వ‌ర్మ ఓ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

ఈ చిత్రానికి అన్నగారు అనే టైటిల్ క‌న్‌ఫామ్ చేసిన‌ట్టు స‌మాచార‌మ్‌. ముందు ఒట్టు అనే పేరు పెడ‌దాం అనుకొన్నా – చివ‌రికి అన్నగారు వైపే మోహ‌న్‌బాబు మెగ్గు చూపార‌ట‌. పైగా సెంటిమెంట్‌గా కూడా ఉంటుంద‌ని ఫీలౌతున్నార‌ట‌. పేరు వ‌ర‌కూ ఒకే. తెర‌పైనా అన్నగారిని మోహ‌న్‌బాబు వాడుకొంటాడా?  ఆయ‌న్ని గుర్తుచేసేలా న‌టిస్తాడా?  లేదంటే ఎన్టీఆర్‌కు సంబంధించిన సన్నివేశాలేమైనా ఈ చిత్రంలో ఉన్నాయా??  అన్నది ఆస‌క్తికంగా మారింది.

 పైగా వివాదాస్పద అంశాలంటే వ‌ర్మకి భ‌లే స‌ర‌దా. ఈసారి ఏదో కెలికే ఉంటాడ‌నే టాక్ వినిపిస్తోంది. అన్నట్టు సినిమా నిర్మాణం కూడా దాదాపుగా పూర్తికావ‌చ్చింద‌ట‌. మార్చిలో విడుద‌ల చేస్తార‌ని స‌మాచార‌మ్‌.