గోరంతలను కొండంతలు చేస్తుంది మీడియా. ముఖ్యంగా హీరోయిన్స్, సెక్సీ యాంకర్స్ విషయంలో మరింత ఆసక్తి చూపించి లోపాలను ఎత్తి చూపిస్తుంది. ఈటీవీలో వస్తున్న జబర్‌దస్త్ ప్రోగ్రామ్‌కి స్పెషల్ ఎట్రాక్షన్ యాంకర్ రేష్మీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె కోసమే కుర్రాళ్ళు టీవీలకు అతక్కుపోతారు. ఆమె యాంకరింగ్, డ్రెస్సులూ అలా వుంటాయి మరి.
అలాంటి రేష్మి డ్రస్సుల గురించి పత్రికల్లో విపరీతార్ధాలు తీస్తూ వ్యాసాలు రావడంతో రేష్మి చీరలు కట్టేసుకుని యాంకరింగ్ చెయ్యడం విచిత్రం. మీడియా గోల పెడితే మాత్రం తన బ్రాండ్ ఇమేజ్‌ని మార్చేసుకోవడం ప్రేక్షకులకూ నచ్చడంలేదట. చీరలు కడితే సమంత కూడా అదోలా కనిపిస్తుంది కాబట్టి, రేష్మి ఎప్పటిలానే జానా బెత్తెడు డ్రస్సులు కట్టుకుని గమ్మత్తుగా చేసే యాంకరింగే మాకు కావాలి.. అని కుర్రాళ్ళు ఆందోళన చెందుతున్నారట.
కాబట్టి రేష్మి మునుపటిలాగే మురిపించాలనీ, తన గ్లామర్‌ని చీరల్లో కప్పుకుని నిరాశపరచకూడదనీ మనమూ కోరుకుందాం. చీరలు కట్టుకుని యాంకరింగ్ చెయ్యడానికి రేష్మి ఎందుకు, ఏ సుబ్బమ్మో చాలు కదా.!