మీడియం రేంజ్ హీరో కావలెను

తెలగు సినిమా జనాలకు కొత్త సమస్య వస్తోంది. అదే మీడియం రేంజ్ హీరోల కరువు. అయితే టాప్ హీరోలు, లేకుంటే మూడు నుంచి అయిదు కోట్ల హీరోలు వున్నారు. లేదు అంటే, వరుణ్ సందేశ్,…

తెలగు సినిమా జనాలకు కొత్త సమస్య వస్తోంది. అదే మీడియం రేంజ్ హీరోల కరువు. అయితే టాప్ హీరోలు, లేకుంటే మూడు నుంచి అయిదు కోట్ల హీరోలు వున్నారు. లేదు అంటే, వరుణ్ సందేశ్, నిఖిల్ లాంటి చిన్న హీరోలు వున్నారు. ఒకప్పుడు అల్లరి నరేష్ లాంటి క్రౌడ్ పుల్లింగ్ వుండి కోటి రూపాయిలకు వచ్చే హీరో వుండేవాడు. ఆయనా రెండు దాటేసాడు. 

నాని మార్కెట్ పాడయింది. సునీల్ మూడు కోట్లకు తగ్గనంటున్నాడు. దాంతో కాస్త ఓపెనింగ్స్ తేగలిగి, కోట్ బడ్జెట్ లో వచ్చే హీరో ఎవరూ లెకుండా పోయారు. హీరొలు కాస్త పేరు వస్తే కోటి దాటేస్తున్నారు. దాంతో మీడియం నిర్మాతలు ఖాళీగా వుండాల్సి వస్తోంది. సుధీర్ కుమార్, సుమంత్ అశ్విన్, నిఖిల్ లాంటి వాళ్లు మరి కొన్ని విజయాలు చూడాలి. అప్పుడు కానీ కాస్త ఓపెనింగ్స్ రావు. తీరా ఆ రేంజ్ కు వస్తే, రేటు కొండ ఎక్కేస్తుంది. 

ఇతర భాషల్లో అన్ని రకాల రేంజ్ హీరొలు వున్నారు. అక్కడ అలాంటి వాళ్లు నటించి, హిట్ అయిన సినిమాలు ఇక్కడకు తెద్దామన్నా, ఆ రేంజ్ హీరొలు ఇక్కడ దొరక్క నిర్మాతలు కిందామీదా అవుతున్నారట. అయితే మరింత మీదకు వెళ్లాలి. లేదంటే ఓపెనింగ్స్ మరిచిపోయి, కిందకు దిగాలి. ఏం చేయాలా అన్నది అర్థం కావడం లేదట చాలా మంది నిర్మాతలకు.