ఒక్కో జోనర్ లో ఒక్కో సినిమా తీసుకువెళ్తున్నాడు దర్శకుడు రాజమౌళి. పైగా ఇప్పుడు ఆయన దృష్టంతా భారీ పెట్టుబడి, భారీ రాబడులు అనే సబ్జెక్ట్ ల చుట్టూ తిరుగుతున్నాయి. అయితే అదే సమయంలో సినిమా సినిమాకు నడుమ రిలాక్స్ గా ఓ చిన్న సినిమా అన్నది కాన్సెప్ట. మర్యాద రామన్నా, ఈగ అలాగే తయారయ్యాయి. ఆప్ కోర్స్ మేకింగ్ పరంగా ఈగ పెద్ద సినిమా అయి కూర్చుందనుకోండి.
ఇప్పుడు బాహుబలి తరువాత చిన్న సినిమా చేయడమా, లేక కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని పెద్దసినిమా చేయడమా అన్నది రాజమౌళి ఆలోచనగా ఆయన సన్నిహితులు చెప్పారంటూ వదంతులు గుప్పుమంటున్నాయి. వీటిలో ఒకటి ఆదిత్య 369 కి సీక్వెల్ తీస్తారని. కానీ రాజమౌళి ఒకళ్ల సబ్జెక్ట్ లు టచ్ చేసే రకం కాదని, తన ఆలోచనల తనవే అని అంటున్నారు. అన్నీ జోనర్ అయ్యాయని, సైంటిఫిక్ జోనర్ పై ఆలోచన అయితే వుందని, దానికి భారీ పెట్టుబడులు, వసూళ్లు వుంటాయని, అయితే బి సి సెంటర్లకు కూడా సరిపోయే సైంటిఫిక్ సబ్జెక్ట్ కోసం రాజమౌళి చూస్తున్నారని, అంతే తప్ప ఆదిత్య సీక్వెల్ పై కాదని మరో వాదన వినిపిస్తోంది.
కానీ సన్నిహిత వర్గాలు మాత్రం ఇదంతా ట్రాష్ అని, అసలు బాహబలి వ్యవహారంలో రాజమౌళి పీకల లోతులో మునిగి వున్నారని, ఈ సమయంలో మరే ఇతర ఆలోచనలు చేయడం లేదనీ అంటున్నారట. అయినా బాహుబలి ఇంకా టేకింగ్ పార్టే పూర్తి కాలేదు. ఆపై పోస్టు ప్రొడక్షన్ పనులు కనీసం ఆర్నెల్లయినా వుంటాయి. అంటే దగ్గర దగ్గర మరో ఏడాది దాకా ఇలా వదంతులు, వాటిపై అనుబంధ వదంతులు తప్ప, మరేమీ వుండకపోవచ్చు.