ఆగస్టు 22..మెగాభిమానులకు పండగ రోజు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఇది మరో వారం రోజుల దూరంలోకి వచ్చేసింది. తన బర్త్ డే సందర్భంగా నాలుగు సినిమాల నుంచి మెటీరియల్ విడుదల చేయమని మెగాస్టార్ నుంచి నిర్మాతలకు ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది.
చిరకాలంగా షూటింగ్ దశలో వున్న ఆచార్య సినిమా విడుదల డేట్ తో కూడిన పోస్టర్ వస్తుంది. జనవరి 7న విడుదలకు దర్శకుడు కొరటాల శివ మొగ్గు చూపుతున్నారని వినిపిస్తోంది.
అక్టోబర్ 13న విడుదలకు ఆయన అంత సుముఖంగా లేరు అని ఇన్ సైడ్ టాక్. మొత్తానికి మెగా బర్త్ డే సందర్భంగా విడుదల డేట్ లో క్లారిటీ అయితే వచ్చే అవకాశం వుంది.
ఇక లూసిఫర్ సినిమా రీమేక్ అయిన గాడ్ ఫాదర్ స్టార్ట్ అయింది. ఆ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం వుంది. ఏదో ఒక సమ్ కంటెంట్ అయితే విడుదల చేయమని మెగాస్టార్ క్లారిటీగా చెప్పారని తెలుస్తోంది.
ఇప్పటి వరకు స్టార్ట్ కాని సినిమాలు రెండు వున్నాయి. బాబీ డైరక్షన్ లో ఒకటి, వేదాలం రీమేక్ మరొకటి. ఈ రెండింటి నుంచి కూడా పోస్టర్ లు వస్తాయని తెలుస్తోంది. మరి ఆ పోస్టర్ల వైనం ఏమిటో తెలియాల్సి వుంది.