Advertisement

Advertisement


Home > Movies - Press Releases

ఇందువదన..కళ్లలోకి కళ్లు పెట్టి..

ఇందువదన..కళ్లలోకి కళ్లు పెట్టి..

శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య, సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎమ్ ఎస్ ఆర్ దర్శకత్వం వ‌హిస్తున్న‌, శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. 

వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. తాజాగా ఈ చిత్రం నుంచి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. 

ఎస్పీ చరణ్, సాహితీ చాగంటి ఈ పాటను ఆలపించారు. భాస్కరభట్ల రవికుమార్ ఈ పాటను రచించారు. పాటలో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ ను చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు . 

హీరో వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా