బాలయ్యతో నదియా

‘మిర్చి’ సినిమాలో ప్రభాస్‌ తల్లిగా నటించిన నదియా, ఆ సినిమా సక్సెస్‌తో టాలీవుడ్‌కి హాట్‌ ప్రాపర్టీ అయ్యింది. పవన్‌కళ్యాణ్‌ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా నదియాకి మరో బెంచ్‌ మార్క్‌ అయ్యిందని ప్రత్యేకంగా…

‘మిర్చి’ సినిమాలో ప్రభాస్‌ తల్లిగా నటించిన నదియా, ఆ సినిమా సక్సెస్‌తో టాలీవుడ్‌కి హాట్‌ ప్రాపర్టీ అయ్యింది. పవన్‌కళ్యాణ్‌ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా నదియాకి మరో బెంచ్‌ మార్క్‌ అయ్యిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా నదియా నటించిన రెండు సినిమాలు హిట్‌ అవడంతో, నదియాని గోల్డెన్‌ లెగ్‌గా భావిస్తున్నారిప్పుడు టాలీవుడ్‌లో.

తాజాగా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘లెజెండ్‌’ సినిమాలో నదియా నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయెల్‌ రోల్‌ పోషిస్తోన్న విషయం విదితమే. బాలయ్య పోషించనున్న తండ్రి పాత్రకు జోడీగా నదియా నటించబోతోందట.

2014 ప్రధమార్థంలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.