తరాలు గడుస్తున్నా నటించే అవకాశం అందరికీ వుండదు. కాలానికి నిలిచి, కెరియర్ ను నిలబెట్టుకున్నవారికే అది సాధ్యమవుతుంది. నటుడు నాగార్జున కెరీర్ అచ్చం అలాంటిదే. పాతికేళ్లు దాటింది. ఇంకా ఎనర్జిటిక్ గా హీరోగా నటించగలగడం ఒక ఎత్తు. వైవిధ్యమైన కథలు ఎన్నుకుని చేస్తుండడం మరో ఎత్తు.
మంచు విష్ణుతో కలిసి కృష్ణార్జున చేసాడా..అంతకు మందు హరికృష్ణతో కలిసి వైవిఎస్ చౌదరితో సినిమా చేసాడు. ఇప్పడు హరికృష్ణ కొడుకు ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయబోతున్నాడు. సరే, తన కొడుకు చైతన్యతో కలిసి మనం చేసిన సంగతి సరేసరి.ఇలా విభిన్నంగా సినిమాలు చేయడం నాగ్ సమకాలికుల్లో అతగాడికే చెల్లింది.