నానికి మరో సినిమా

మంచి స్టామినా వున్న నటుడు నాని. కానీ కెరీర్ ఒడి దుడుకుల్లో పడింది. తిరిగి ఇప్పుడిప్పుడే సెట్ అవుతోంది. మారుతి, 14 రీల్స్, స్వప్న మీడియా ఇలా ఒక్కో సినిమా అంగీకరిస్తున్నాడు. తాజగా మరో…

మంచి స్టామినా వున్న నటుడు నాని. కానీ కెరీర్ ఒడి దుడుకుల్లో పడింది. తిరిగి ఇప్పుడిప్పుడే సెట్ అవుతోంది. మారుతి, 14 రీల్స్, స్వప్న మీడియా ఇలా ఒక్కో సినిమా అంగీకరిస్తున్నాడు. తాజగా మరో సినిమా కూడా అతని ఖాతాలోకి వస్తోంది. బాణం, బసంతి లాంటి డిఫరెంట్ సినిమాలు తీసిన చైతన్య దంతులూరి దర్శకత్వంలో నాని ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను రంజిత్ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. అలా మొదలైంది..అంతకు ముందు ఆ తరువాత లాంటి హిట్ సినిమాలు ఈ బ్యానర్ ఖాతాలో వున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా ఖరారు కావాల్సి వుంది. 

ఇదిలా వుంటే రంజిత్ మూవీస్ సంస్థ తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ప్రయత్నాల్లో వున్నట్లు తెలిసింది. బహుశా సుమంత్ అశ్విన్ దీనికి హీరో కావచ్చు. తేజ చెప్పిన పాయింట్ నచ్చడంతో రంజిత్ మూవీస్ దాన్ని తెరకెక్కించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.