కిక్ 2 సమయంలో తాను లండన్ నుంచి వచ్చి, అప్పు కాగితాలపై సంతకాలు చేసి, అన్న కళ్యాణ్ రామ్ ను ఆదుకున్నానని రూమర్లు లేపారంటూ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేసాడు షేర్ ఆడియో ఫంక్షన్ లో. ఎప్పటికీ కళ్యాణ్ రామ్ ది పైచేయే కానీ కింద చేయి కాదు అని కూడా అన్నాడు. అంతా బాగానే వుంది..మంచి మాటే.
కానీ తాను సంతకం చేయలేదని కానీ, దిల్ రాజుకు సినిమా కింద చెల్లు బాటు చెస్తానని కానీ అనలేదు..అనలేడు కూడా. వదంతులు లేపారని ఆవేదన చెందిన ఎన్టీఆర్, అవి పక్కా వదంతులే, నేను ఎవరిదగ్గరా ఏ సంతకాలు చేయలేదని కూడా స్ఫష్టంగా చెప్పవచ్చుగా? నిప్పు లేకుండా పొగ రాదు టాలీవుడ్ లో. ఆ విషయం తెలిసీ, పూర్తిగా తాను ఖండిచలేనని తెలిసీ కూడా ఈ విషయం కెలకడం ఎందుకో ఎన్టీఆర్?