‘సింహాద్రి’ సినిమా వచ్చినపుడు చిరంజీవి తర్వాతే ఇతడే అని అనేసుకున్నారు యంగ్ టైగర్ గురించి. అయితే ఒక ఘన విజయం తర్వాత, ఆ సినిమా తాలూకు ఇంపాక్ట్ తర్వాత దానిని మ్యాచ్ చేసే సినిమా చేయడం అంత తేలిక కాదు. చాలా మంది హీరోలలానే ఎన్టీఆర్ కూడా ఆ విషయంలో ఇబ్బందులు పడ్డాడు.
సింహాద్రి తర్వాత ఇన్నేళ్లలో ఎన్టీఆర్‌కి మళ్లీ అలాంటి భారీ విజయం దక్కలేదు. యమదొంగ, బృందావనం, బాద్‌షాలాంటి హిట్స్ అయితే వచ్చాయి కానీ అవేమీ సింహాద్రి మాదిరిగా ప్రభంజనం సృష్టించలేదు. స్టార్ హీరోలంతా యాభై కోట్లకి పైగా వసూళ్లని సాధిస్తోంటే ఎన్టీఆర్ కెరీర్‌లో ఇంతవరకు ఒకేఒక్క నలభై కోట్లు దాటిన సినిమా (బాద్షా) ఉంది.
ఎన్టీఆర్ సత్తా చాటే సినిమా త్వరలోనే వస్తుందని అభిమానులు, ఫాన్స్ ఆకలి తీర్చే సినిమా ఇవ్వాలని ఎన్టీఆర్ చాలా కాలంగా కల కంటున్నారు. అది టెంపర్‌తో అయినా తీరుతుందని అనుకుంటే… ఈ చిత్రం యాభై కోట్ల రేంజికి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. తొలి వారంలో బ్రహ్మాండమైన బిజినెస్ చేసినప్పటికీ కలెక్షన్స్ ట్రెండ్ ప్రకారం ఈ చిత్రం ఫుల్ రన్‌లో నలభై రెండు నుంచి నలభై అయిదు కోట్ల షేర్‌తో సరిపెట్టుకునేలా ఉంది. సో.. యథాప్రకారం తారక్ బ్లాక్‌బస్టర్ డ్రీమ్స్ నెక్స్‌ట్ మూవీకి షిఫ్ట్ అవ్వక తప్పదు.