ఎన్టీఆర్‌ ఇప్పుడైనా కొడతాడా?

‘సింహాద్రి’ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి అలాంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ రాలేదు. రాజమౌళి కూడా ‘యమదొంగ’తో హిట్‌ అయితే ఇచ్చాడు కానీ ఎన్టీఆర్‌కి భారీ హిట్‌ని మాత్రం ఇవ్వలేకపోయాడు. తొమ్మిదేళ్లుగా ఒక మాదిరి విజయాలతోనే…

‘సింహాద్రి’ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి అలాంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ రాలేదు. రాజమౌళి కూడా ‘యమదొంగ’తో హిట్‌ అయితే ఇచ్చాడు కానీ ఎన్టీఆర్‌కి భారీ హిట్‌ని మాత్రం ఇవ్వలేకపోయాడు. తొమ్మిదేళ్లుగా ఒక మాదిరి విజయాలతోనే ముందుకి సాగుతున్న ఎన్టీఆర్‌ ఇప్పటికీ టాప్‌ 5 హిట్స్‌లో చోటు దక్కించుకోలేదు. 

ఓపెనింగ్స్‌తో తన స్థాయిని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నా కానీ అంతటితోనే అతని సినిమాలు సరిపెడుతున్నాయి. ఈసారి అయినా ఆ భారీ హిట్‌ కల తీర్చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ‘రామయ్యా వస్తావయ్యా’ ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ కోరుకుంటోన్న ఆ భారీ విజయం వస్తుందనే 
అనిపిస్తోంది. 

హరీష్‌ శంకర్‌ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. దిల్‌ రాజు కూడా ఇది యాభై కోట్లకి పైగా వసూలు చేసే సినిమా అవుతుందని హింట్‌ ఇచ్చాడు. తన బ్యానర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందని, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుని అధిగమిస్తుందని చెప్పకనే చెప్పాడు. ఎన్టీఆర్‌కి బృందావనంతో హిట్‌ వచ్చిన దసరా సెలవుల్లో ఈసారి రామయ్య ఎన్ని సంచలనాలు చేస్తాడనేది వేచి చూద్దాం.