పవన్ కొడుకు ఫంక్షన్ యూరప్ లో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఛలో యూరప్ అంటున్నారు. ఇది పక్కా ఫ్యామిలీ ట్రిప్. తన మూడో భార్యకు, తనకు కలిగిన సంతానం శంకర పవనో విచ్ కోసం ఆయన యూరప్ కు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఛలో యూరప్ అంటున్నారు. ఇది పక్కా ఫ్యామిలీ ట్రిప్. తన మూడో భార్యకు, తనకు కలిగిన సంతానం శంకర పవనో విచ్ కోసం ఆయన యూరప్ కు క్రిస్మస్ ట్రిప్ గా వెళ్తున్నారు. శంకరపవనోవిచ్ కు చిన్నతనంలో మతాచారం ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలు ఏవో వున్నాయట.

హిందువులు పంచెకట్టు ఫంక్షన్, ఒడుకు లాంటివి చిన్నతనంలో ఓ వయస్సు వచ్చాక చేస్తారు. మరి క్రైస్తవ మతాచారం ప్రకారం చిన్నతనంలో చేయాల్సినవి ఏవో వుండి వుంటాయి. వాటిని యూరప్ లో చేయాలని ముచ్చటపడ్డారట పవన్ భార్య.

అందుకే పవన్ సతీ, సుత సమేతంగా యూరప్ వెళ్తున్నారు. ఇదిలా వుంటే తిరిగివచ్చాక ఇక ఎక్కువ అమరావతిలోనే వుంటారట. ఇకపై సీరియస్ గా పార్టీ నిర్మాణానికే టైమ్ కేటాయిస్తూ, కార్యకర్తలకు అందుబాటులో వుంటారట. అంటే ఇక జనసేన పార్టీ నిర్మాణ కార్యక్రమాలు ఊపు అందుకుంటాయోమో చూడాలి.

పడి పడి లేచె మనసు… పడి… మళ్లీ లేవలేదు! ఎందుకో తెలుసా? 

భేకార్ మాటల్.. థియేటర్స్ గుప్పిట్లో పెట్టుకుని డ్యాన్స్ ఏస్తామా