పిల్ల డోసు పెంచింది

క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే బికినీ వేయడానికి కూడా సిద్ధమే అని ఈమధ్యే పేర్కొన్న ‘కొత్తజంట’ ఫేమ్‌ రెజీనా… ఆల్రెడీ తనలోని గ్లామర్‌ యాంగిల్‌ చూపించే పనిలో పడ్డట్టుంది. ‘శంకర’ చిత్రంలో రెజీనా తొలిసారిగా కాసింత…

క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే బికినీ వేయడానికి కూడా సిద్ధమే అని ఈమధ్యే పేర్కొన్న ‘కొత్తజంట’ ఫేమ్‌ రెజీనా… ఆల్రెడీ తనలోని గ్లామర్‌ యాంగిల్‌ చూపించే పనిలో పడ్డట్టుంది. ‘శంకర’ చిత్రంలో రెజీనా తొలిసారిగా కాసింత ఎక్స్‌పోజింగ్‌ చేసింది. ఇంతవరకు అన్ని సినిమాల్లోను అందాల ప్రదర్శనకి దూరంగా ఉన్న రెజీనా ఇప్పుడు రూటు మార్చింది.

 సరైన హిట్లు లేని నారా రోహిత్‌ ‘శంకర’ చిత్రంలో హీరో. అతని కంటే ఈ చిత్రం పబ్లిసిటీలో రెజీనాపై ఎక్కువ ఫోకస్‌ ఎందుకు పెడుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు. చిన్న సినిమాల్లో నటిస్తున్నా కానీ రెజీనా తనకంటూ గుర్తింపుని తెచ్చుకుంది. కొత్తజంటతో రెజీనా ఇంకొంచెం పాపులర్‌ అవడంతో శంకర చిత్రానికి ఆమెని ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నారు.

మొదటిసారి కొంచెం స్కిన్‌ షోకి కూడా సిద్ధపడిందేమో… రెజీనా ఇప్పుడు అన్ని వెబ్‌సైట్స్‌లో ప్రముఖంగా దర్శనమిస్తోంది. మరి ఈ పబ్లిసిటీ వల్ల శంకరకి, నారా రోహిత్‌కి ఏమైనా కలిసొస్తుందో లేదో చూడాలి.