టార్గెట్ ఇచ్చిన ప్రభాస్!

ఇన్నాళ్లూ ఈ సినిమాకు ఇన్ని, ఆ సినిమాకు కొన్ని అనే విధంగా కాల్షీట్లు సర్దుబాటు చేస్తూ వచ్చాడు ప్రభాస్. కానీ ఇకపై అలా జరిగే ఛాన్స్ లేదు. అందుకే దర్శకుడు మారుతికి డెడ్ లైన్…

ఇన్నాళ్లూ ఈ సినిమాకు ఇన్ని, ఆ సినిమాకు కొన్ని అనే విధంగా కాల్షీట్లు సర్దుబాటు చేస్తూ వచ్చాడు ప్రభాస్. కానీ ఇకపై అలా జరిగే ఛాన్స్ లేదు. అందుకే దర్శకుడు మారుతికి డెడ్ లైన్ ఇచ్చాడు ప్రభాస్.

వచ్చే నెల లోపు రాజాసాబ్ షూటింగ్ మొత్తం పూర్తిచేయాలని మారుతికి సూచించాడు. దీని కోసం నెల రోజుల కాల్షీట్లు అన్నింటినీ ఈ సినిమాకే కేటాయించాడు. ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఓ కారణం ఉన్నట్టు తెలుస్తోంది.

త్వరలోనే హను రాఘవపూడి దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ప్రభాస్. పీరియాడిక్ కథతో రాబోతున్న ఈ మూవీ కోసం కాస్త డిఫరెంట్ లుక్ లో కనిపించాల్సి ఉంది. అలా కనిపించాలంటే, రాజాసాబ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. అందుకే ఈ నిర్ణయం.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయినట్టు నిర్మాత విశ్వప్రసాద్ తెలిపాడు. అక్టోబర్ చివరి నాటికి టాకీ అయిపోతుందని, ఆ తర్వాత సాంగ్స్ షూటింగ్ పెట్టుకుంటామని అన్నాడు. అయితే అక్టోబర్ చివరి నాటికి టాకీతో పాటు, సాంగ్స్ కూడా పూర్తిచేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ సినిమాకు ఇదివరకే విడుదల తేదీ ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 10న రాజాసాబ్ థియేటర్లలోకి వస్తున్నాడు.

2 Replies to “టార్గెట్ ఇచ్చిన ప్రభాస్!”

Comments are closed.