తను విడాకులు తీసుకోబోతున్నట్టు స్వయంగా ప్రకటించాడు తమిళ హీరో జయం రవి. భార్య ఆర్తితో కలిసి చర్చించి, పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. తమ ప్రైవసీని అంతా గౌరవించాలని కూడా కోరాడు.
అంతా బాగానే ఉంది కానీ, ఇప్పుడీ విడాకుల వ్యవహారం ఓ కోశాన ‘ప్రైవసీ’ కిందకు వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే, జయం రవి భార్య ఆర్తి అడ్డం తిరిగారు. తన అనుమతి లేకుండా విడాకుల గురించి జయం రవి ప్రకటించారని ఆమె బాంబ్ పేల్చారు.
“నాకు తెలియకుండా, నా సమ్మతి లేకుండా ఇటీవల మా విడాకులపై బహిరంగ ప్రకటన చేయడంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను, ఎంతో బాధపడ్డాను. 18 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఉన్న నేను, ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవడానికి తగినంత గౌరవం, అర్హత కలిగి ఉన్నానని భావిస్తున్నాను.”
భర్త జయం రవితో ఓపెన్ గా మాట్లాడ్డానికి కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నానని, కానీ దురదృష్టవశాత్తూ తనకు ఆ అవకాశం దక్కలేదన్నారు ఆర్తి. విడాకుల ప్రకటన గురించి తనకు, తన పిల్లలకు అస్సలు తెలియదని, ఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని ఆమె ఆరోపించారు.
“ఈ విషయంపై నేను బయటకొచ్చి పబ్లిక్ గా మాట్లాడొచ్చు. కానీ నేను గౌరవప్రదంగా ఉండడానికే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే, నాపై అన్యాయంగా నిందలు వేసి, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే తప్పుడు ప్రచారాన్ని నేను భరించలేను. ఒక తల్లిగా నా తొలిప్రాధాన్యం నా పిల్లలే. వాళ్లపై తప్పుడు కథనాలు ప్రభావం చూపించడం నాకిష్టం లేదు.”
ఆర్తి స్టేట్ మెంట్ తో ఈ విడాకుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అంతేకాదు, కొన్నాళ్లుగా వీళ్లిద్దరూ మాట్లాడుకోవడం లేదనే విషయం కూడా బయట ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ ప్రకటనపై జయం రవి ఎలా స్పందిస్తాడో చూడాలి.
ఇదికూడా న్యూసే
vc available 9380537747
కోర్టుకెక్కేక ఇంకా ప్రైవసీ ఏంటిరా ..బొంగు
కోర్టుకెక్కేక ఇంకా ప్రైవసీ ఏంటిరా ..
అహ్ అహ్ అహ్ ..వాళ్ళకి ఉండదు గాని.. అంతకన్న ఈ వెబ్ పేజీకుంది …