హైకోర్టులో జ‌గ‌న్‌కు భారీ ఊర‌ట‌!

పాస్‌పోర్ట్‌ రెన్యువ‌ల్ విష‌య‌మై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం, అందుకు సీబీఐ కోర్టు అనుమ‌తించిన సంగ‌తి తెలిసిందే. అలాగే పాస్‌పోర్ట్‌ను…

పాస్‌పోర్ట్‌ రెన్యువ‌ల్ విష‌య‌మై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం, అందుకు సీబీఐ కోర్టు అనుమ‌తించిన సంగ‌తి తెలిసిందే. అలాగే పాస్‌పోర్ట్‌ను ఐదేళ్ల పాటు రెన్యువ‌ల్‌కు సీబీఐ కోర్టు అనుమ‌తి ఇచ్చింది.

కానీ విజ‌య‌వాడ ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు మాత్రం అంగీక‌రించ‌లేదు. ఏడాదికి ప‌రిమితం చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఈ ఉత్త‌ర్వుల‌పై వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. విచారించిన హైకోర్టు తీర్పును రిజ‌ర్వ్ చేసి వుంచి, 11న వెలువ‌రిస్తామ‌ని పేర్కొంది. ఇవాళ వెలువ‌డిన తీర్పు జ‌గ‌న్‌కు అనుకూలంగా వుంది.

ఐదేళ్ల పాటు రెన్యువ‌ల్ చేయ‌డానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో జ‌గ‌న్ ప‌దేప‌దే పాస్‌పోర్ట్ కార్యాల‌యానికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది.

పాస్‌పోర్ట్ వ్య‌వ‌హారంలో క్లారిటీ రాక‌పోవ‌డంతో ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే అవ‌కాశం వుంది. అలాగే ఏపీలో వ‌ర‌ద లేక‌పోవ‌డం, స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రంగా చేప‌డుతున్నారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం కూడా లేద‌ని జ‌గ‌న్ భావిస్తుండొచ్చు. అందుకే ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు వైసీపీ నేత‌లు చెబుతున్నారు. హైకోర్టు తీర్పుపై వైసీపీ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.

44 Replies to “హైకోర్టులో జ‌గ‌న్‌కు భారీ ఊర‌ట‌!”

  1. Anniya videsalu vellalante court anumathi kavali.. Idi daridram.. nuvvu aa daridram lo kooda ooraga labinchindi ani rasavante.. needi inkaaaa daridram. siggu padara konchem.

  2. 😂😂😂….. వరద మాయం ఐపోయిందా GA… కొంచెం కూడా సిగ్గులేదా GA… ఉత్తరాంధ్ర ను వదిలేసుకున్నారా GA….

  3. ఏంటి పదేపదే పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు అంటున్నావా? మామూలు జనాలకి పది సంవత్సరాలు వాలిడిటీ ఇస్తారు, ఈ మహానుభావుడికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు, దానికి నువ్వు సంకలు గుద్దు కోవడం బాగుంది. వరదలు కూడా అయిపోయాయా? అంటే ఈరోజు రాత్రో, రేపో లండన్ వెళ్తే, కవర్ చేయడానికి ముందే రాసినట్టున్నావ్ కదా. ఏం దరిద్రం రా ఇది.

  4. ఏంటి పదేపదే పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు అంటున్నావా? మామూలు జనాలకి పది సంవత్సరాలు వాలిడిటీ ఇస్తారు, ఈ మహానుభావుడికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు, దానికి నువ్వు సంకలు గుద్దు కోవడం బాగుంది. వరదలు కూడా అయిపోయాయా? అంటే ఈరోజు రాత్రో, రేపో లండ న్ వెళ్తే, కవర్ చేయడానికి ముందే రాసినట్టున్నావ్ కదా. ఏం దరిద్రం రా ఇది.

  5. ఇంక మన అన్నయ్య వచ్చే ఎలక్షన్స్ వరకు ఈ అరెస్టులకి దూరంగా విదేశాల్లో ఎంచక్కా చుట్టూ చుట్టేయొచ్చు , మళ్లీ ఎలక్షన్ వచ్చేంతవరకు ఆంధ్రప్రదేశ్ ముఖం కూడా చూడు అవసరం లేదు బాబు గారు మొహం అసలు చూడవసరం లేదు మన సారు తెలివితేట్లే తెలివితేటలు.

  6. ఏ దేశాన్ని పాలించడానికి వెళ్తున్నారు పులిరాజా వారు????

    వరద బురద రాజకీయం చేసి అలసిపోయి శీతల ప్రదేశాలకు పోయి సేదతీరు తారా???

      1. హైదరాబాదు విదేశాల్లో లేదు.

        మన దేశం లోనే ఉంది.

        కరోనా దేశంలో అన్ని ప్రాంతాల్లో వ్యాప్తి చెందినట్లు హైదరాబాదు లో కూడా వ్యాప్తి చెందింది.

        ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండాల్సి వచ్చింది.

      2. ఇక్కడ ఉంటే వరద బాధితుల కోసం స్వంత ధనం ఎంతిచ్చావని అడిగితే సమాధానం ఉండదు.

        అందుకే ఎవ్వరి ప్రశ్న వినపడనంత దూరం పారిపోయి తర్వాత రావచ్చు అని చచ్చు ఐడియా పులిరాజావారిది.

        1. జీవితంలో ఎన్నడూ ఒక్క రూపాయి కూడా కష్టపడి సంపాదించి ఎరుగరు. తన స్వంత సొమ్ము లోంచి ఒక్క పైసా పేదలకిచ్చి ఎరుగరు మన పులిరాజావారు.

  7. తిరిగీ వస్తాడా అసలు, లేక పి*చ్చి తగ్గే ట్రీట్మెంట్ కోసం అక్కడే హాస్పిటల్ లో ఇనుప గొలుసులు తో కెట్టేసి పెడతారు ఏమో!

  8. జగన్ కోర్టు కి వెళ్లి 20000 బాండ్ submit చెయ్యాలి , దాని గురించి రాయలేదు ఏంటి GA? వారు హై కోర్ట్ కి వెళ్ళింది 20000 షూరిటీ గురించే, వెధవకి మళ్లీ నామోషి ఒకటి!!

  9. ఇది అపూర్వ విజయం, 175 / 175 కన్నా గొప్పది. అందరు కేక్ కట్ చేసుకుని సెలెబ్రేట్ చేసుకోండి.ఇంతకీ విదేశాల్లో తిరిగే అనుమతి ఎన్నాళ్ళు వుంది, అది రాయలేదు.

  10. ఇది అపూర్వ విజయం, 175 / 175 కన్నా గొప్పది. అందరు కేక్ కట్ చేసుకుని సెలెబ్రేట్ చేసుకోండి.

  11. ఇది అపూర్వ విజయం, 175 / 175 కన్నా గొప్పది. అందరు కేక్ కట్ చేసుకుని సెలెబ్రేట్ చేసుకోండి. ఇంతకీ విదేశాల్లో తిరిగే అనుమతి ఎన్నాళ్ళు వుంది, అది రాయలేదు.

  12. ఇంతకీ విదేశాల్లో తిరిగే అనుమతి ఎన్నాళ్ళు వుంది, అది రాయలేదు.

  13. విజయవాడ ప్రజా ప్రతినిధుల కో ర్టు ఆదేశించినట్లుగా రూ.20 వేల పూచీకత్తు స్వయంగా సమర్పించాలని.. ట్రయల్ కో ర్టు విధించిన మిగతా షరతులు అన్ని యధావిధిగా ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసిన విషయం కూడా చెప్పు గజాలా. అలా చెబితే బాత్రూంలో నీకు హార్ట్ ఎటాక్ వస్తుందా.

  14. సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు అని ఒప్పుకోక తప్ప లేదు జీఏ కు, జగన్ ప్రయాణానికి NOC ఇచ్చి పడేసాడు.

Comments are closed.