పూరి జగన్నాధ్.. పోకిరి, బిజినెస్ మన్, టెంపర్ లాంటి సినిమాలు. రామ్ మీడియం రేంజ్ హీరోగా ఇంతో అంతో పేరు. ఇలాంటి కాంబినేషన్ అంటే కనీసం థియేటర్ హక్కులు 20 కోట్లు అన్నా వుండవా? వుండవనే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. పూరి-రామ్ కాంబినేషన్ లో తయారవుతున్న ఇస్మార్ట్ శంకర్ థియేటర్ రైట్స్ మార్కెట్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. సినిమా వర్క్ ఇంకా చాలా వుంది. ఫండ్స్ అవసరం కూడా వుండే వుంటుంది.
అందుకే డొమస్టిక్ థియేటర్ మార్కెట్ రైట్స్ అమ్మకానికి ఆఫర్ చేసారు. ఇండియా వైజ్ థియేటర్ రైట్స్ ను 15 కోట్లకు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బయ్యర్లు 12 కోట్ల రేంజ్ లో అడుగుతున్నట్లు బోగట్టా. ఆంధ్ర, సీడెడ్, తెలంగాణ, కర్ణాటకలు మెయిన్ మార్కెట్. 12 కోట్ల రేంజ్ అంటే తక్కువే అనుకోవాలి.
ఇటీవలే రాజశేఖర్ కల్కి సినిమా హక్కులు కేవలం ఆంధ్ర, సీడెడ్, నైజాం, ఓవర్ సీస్ కలిపి 12 కోట్ల మేరకు అమ్ముడయ్యయి. ఆ సినిమా క్రేజీ కాంబినేషన్ కాదు. కానీ అలాంటిది పూరి-రామ్ సినిమాకు 12 కోట్లకు బేరం ఆడుతున్నారు అంటే కాస్త ఆలోచించాల్సిందే.
ఇటీవలే ఈ సినిమా లేట్ అవుతోందని హింట్ ఇచ్చారు. దానికి కారణంగా హీరోయిన్ నిధి అగర్వాల్ పాస్ పోర్ట్ పోవడం అని అన్నారు. కానీ నిథి అగర్వాల్ టీమ్ మాత్రం అది మాత్రమే కారణం కాదని, ఇంకా చాలా వర్క్ పెండింగ్ వుందని, ఓవర్ సీస్ వర్క్ కాకుండా ఇది పూర్తి చేసుకోవచ్చు కదా? అని ఆలస్యానికి వేరే కారణాలు వుంటే, హీరోయిన్ పై నెట్టడం సరికాదని వివరణ ఇచ్చింది.
ప్రస్తుతానికి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టులో కానీ విడుదల కాదని తెలుస్తోంది.