కంగనారనౌత్ బాలీవుడ్‌లో క్వీన్ గా సంచలనం సృష్టించింది. అటు డబ్బులూ, ఇటు అవార్డులూ తెచ్చిపెట్టిన సినిమా అది. అప్పటి నుంచీ దక్షిణాదిన అన్ని భాషల్లోనూ క్వీన్‌ని రీమేక్ చేయాలని త్యాగరాజన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. క్వీన్‌గా త్రిష, సమంత, నయనతార, తాప్సి ఇలా ఎన్నోపేర్లు బయటకు వచ్చాయి.
అయితే వీళ్లెవ్వరూ క్వీన్‌గా కనిపించడానికి సిద్ధంగా లేరని టాక్. అందుకే ఈ పాత్రని ఇప్పుడు నిత్యమీనన్ చేతిలో పెట్టాలని త్యాగరాజన్ భావిస్తున్నాడట. తెలుగు, తమిళం, మలయాళం.. ఇలా దక్షిణాదిన నిత్య బాగా పాపులర్. తనతో ఈ సినిమా చేస్తే అన్ని భాషల్లోనూ గిట్టుబాటు అవుతుందని దర్శకుడి ఆలోచన.
నిత్యకీ ఈ తరహా ప్రయోగాలంటే ఇష్టం. అందుకే నిత్యతో జరుగుతున్న ఈ సంప్రదింపులు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. త్వరలోనే క్వీన్‌గా నిత్య ఎంపికపై ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.