రామోజీ మినీ థియేటర్లు?

సినిమా రంగాన్ని చేతిలో వుంచుకోవాలని ప్రయత్నించినా, మీడియా టైకూన్ రామోజీ అంతగా సక్సెస్ కాలేకపోయారు. మయూరి పేరిట సినిమా పంపిణీ, అడియో పంపిణీ, ఇంకోపక్క సినిమా హోర్డింగ్ లు, మరోపక్క సినిమా నిర్మాణాలుచేసినా, పెద్దగా…

సినిమా రంగాన్ని చేతిలో వుంచుకోవాలని ప్రయత్నించినా, మీడియా టైకూన్ రామోజీ అంతగా సక్సెస్ కాలేకపోయారు. మయూరి పేరిట సినిమా పంపిణీ, అడియో పంపిణీ, ఇంకోపక్క సినిమా హోర్డింగ్ లు, మరోపక్క సినిమా నిర్మాణాలుచేసినా, పెద్దగా విజయాలునమోదు కాలేదు. రామోజీ ఫిల్మ్ సిటీ మాంచి పేరు తెచ్చుకున్నా దానివల్ల సినిమా ఇండస్ట్రీ మీద పట్టు అన్నిది అంతంత మాత్రమే. 

అందుకే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న ఎగ్జిబిషన్ రంగంలోకి ఆయన అడుగుపెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. మల్టీఫ్లెక్స్ లకు జనం అలవాటు పడుతున్నందున, వివిధ ఫట్టణాల్లో చిన్న సైజు డిజిటల్ థియేటర్లు, పూర్తి ఆన్ లైన్ బుకింగ్, సెంట్రలైజ్డ్ బ్రాడ్ కాస్టింగ్ విధానంలో పెద్ద సంఖ్యలో నిర్మించాలని రామోజీరావు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఒక విధంగా వీటి స్థలం కూడా పెద్దగా అక్కరలేదు. లేదూ, ఇప్పటికే నిర్మాణంలో వున్న కమర్షియల్ కాంప్లెక్స్ ల్లో ఓ ఫ్లోర్ తీసుకుని కూడా వీటిని ఏర్పాటు చేయవచ్చు. అనుమతుల సమస్య రామోజీరావు లాంటివారికి పెద్ద విషయం కాదు. ఆంధ్ర, తెలంగాణలో కనీసం 500 నుంచి వెయ్యి మినీ డిజిటల్ థియేటర్లు ఏర్పాటు చేయాలని, వీటిని వీలయినంత కాస్ట్ కటింగ్ తో ఏర్పాటుచేసి, నిర్వహణావ్యయం తక్కువగా వుండేలా ఆలోచనలు చేస్తున్నారట. 

దాని వల్ల చిన్న సినిమాలను నేరుగా ప్రద్శించే అవకాశం వుంటుంది. షేరింగ్ పద్దతిన ఆదాయం పంచుకోవచ్చు. మరి ఈ గుసగుసలు నిజమో, ఇటీవల మినీ డిజిటల్ థియేటర్ల అవసరం పెరిగినందున ఇలాంటి వదంతులు వస్తున్నాయో వేచి చూడాల్సివుంది.