ఇన్నాళ్లు ల్యాబ్ లో వుండిపోయిన రేయ్ సినిమా ఇప్పుడు బయటకు వస్తోంది. 27న విడుదలకు సిద్ధమవుతుంది. ఆంధ్రలో రియల్ ఎస్టేట్ వ్యవహారం మాదిరగానే వుంది రేయ్ మార్కెటింగ్ అని వినికిడి. ఒక్కో జిల్లాకు ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు హక్కులు.
సాయిధరమ్ తేజ మొదటి సినిమా రేటుకు పది ఇరవై శాతం అధికంగానే అడుగుతున్నారు. ఈ రెండూచాలా అనుకూల అంశాలే. ఎందుకంటే ఇన్నాళ్లు మూలన వున్న సినిమాకు కొనుగోలు దారులు ఇద్దరు ముగ్గురు రావడమే గ్రేట్. పైగా సాయి ధరమ్ తేజ మొదటి సినిమా కన్నా ఎక్కువ కోట్ చేయడం ఇంకా గ్రేట్.
కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే, ఇదేదో బాగానే వుంది అని వైవిఎస్ చౌదరి సెటిల్ చేయడం లేదు. ఇంకా ఎక్కువ అడుగుతున్నాడట. వెస్ట్ 80కి అడిగితే, కొటి అయితేనే ఇస్తానంటున్నాడట. అక్కడ పిల్లా నువ్వులేని జీవితం స్టామినా 60 మాత్రమే. బూమ్ వున్నట్లే వుంది.కానీ కొనుగోళ్లు అమ్మకాలు లేవు..ఇది ఆంధ్ర రియల్ ఎస్టేట్ సీన్. రేయ్ సినిమా వ్యవహారం కూడా ఇలాగే కనిపిస్తోంది మరి.