సుక్కు సినిమాకు ఏర్పాట్లు షురూ

సుకుమార్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో నిర్మించే సినిమాకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఏప్రిల్ లో సెట్ మీదకు వెళ్లే ఈ సినిమాకు ట్యూన్లు కట్టడానికి దేవీ రెడీ అవుతున్నారు. ఇందుకోసం దేవీతో మాట్లాడి, రికార్డింగ్ డేట్లు ఫైనల్…

సుకుమార్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో నిర్మించే సినిమాకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఏప్రిల్ లో సెట్ మీదకు వెళ్లే ఈ సినిమాకు ట్యూన్లు కట్టడానికి దేవీ రెడీ అవుతున్నారు. ఇందుకోసం దేవీతో మాట్లాడి, రికార్డింగ్ డేట్లు ఫైనల్ చేయడానికి సినిమా పెద్దలు చెన్నయ్ వెళ్లారు. 

సినిమా అధికభాగం యూరప్ లో తీయాల్సి వుందని, అందుకోసం వీసా, పర్మిషన్లు వగైరాల వ్యవహారాలు టైమ్ తింటున్నందున, ఈ లోగా ఇక్కడ కానివ్వాల్సిన పనులు చుట్టేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే యూరప్ వెళ్లేలోగా పాటల రికార్డింగ్ పూర్తి చేసేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 

సుక్కు-దేవీ కాంబినేషన్ లో ఇంతవరకు అడియో ఫెయిల్ అన్నది లేదు. మరి ఇప్పుడు అదే మాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి.