బాహుబలి పార్ట్ 2న అవుట్ రేట్ ను మొత్తంగా కొనుగోలు చేయడానికి రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఈ డీల్ విలువ 350-400 కోట్ల మధ్యన వున్నట్లు వినికిడి. పార్ట్ 2ను యాజిటీజ్ గా వరల్డ్ వైడ్ హక్కులు తాము తీసుకునేందుకు రిలయన్స్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి బాహుబలి 2 ప్రాజెక్టును తీసుకునేందుకు చాలా కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. కొన్నింటితో డిస్కషన్లు కూడా నడిచాయి. కానీ ఏదీ ఫైనల్ కాలేదు. పైగా ఒకటి రెండు ఏరియా హక్కులు విక్రయించారు కూడా. రాజమౌళి సన్నిహితుడు సాయి కొర్రపాటి ఒకటి రెండు ఏరియాలు తీసుకున్నారు. మరి ఇలాంటి నేఫథ్యంలో రిలయన్స్ సంస్థతో ఒప్పందం వుంటుందని వార్తలు ఎందుకు గుప్పుమన్నాయో?
నిజానికి పార్ట్ వన్ నే విజయవంతంగా మార్కెట్ చేయగలిగినపుడు, రెండో భాగాన్ని అమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది ఆటోమెటిక్ గా మార్కెట్ అవుతుంది. రెండవది ఆర్థిక సమస్యలు కూడా వుండవు. ఇలాంటివి అన్నీ వుంటే గింటే తొలిభాగానికే. కానీ దాన్నే విజయవంతంగా గట్టెక్కారు. అందువల్ల అవుట్ రేట్ ఇవ్వడం అన్నది కేవలం జస్ట్ ఓ డిస్కషన్ పాయింట్ లేదా, ఆఫర్ మాత్రమే అయి వుండాలి.