హైద‌రాబాద్ రోడ్లపై సూపర్ స్టార్ బైక్ రైడింగ్‌?

తెలంగాణ రాజ‌ధాని న‌గ‌రంలో ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో ఉన్న షారూఖ్‌ఖాన్ హైద‌రాబాద్ రోడ్లపై బైక్‌తో చ‌క్కర్లు కొడుతున్నాడని స‌మాచారం. అయితే ఈ బాలీవుడ్ బాద్‌షా త‌న‌నెవ‌రూ గుర్తు ప‌ట్టకుండా జాగ్రత్త ప‌డుతున్నాడ‌ట‌. Advertisement ప్రస్తుతం…

తెలంగాణ రాజ‌ధాని న‌గ‌రంలో ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో ఉన్న షారూఖ్‌ఖాన్ హైద‌రాబాద్ రోడ్లపై బైక్‌తో చ‌క్కర్లు కొడుతున్నాడని స‌మాచారం. అయితే ఈ బాలీవుడ్ బాద్‌షా త‌న‌నెవ‌రూ గుర్తు ప‌ట్టకుండా జాగ్రత్త ప‌డుతున్నాడ‌ట‌.

ప్రస్తుతం దిల్‌వాలే షూటింగ్ నిమిత్తం హైద‌రాబాద్‌లో ఉన్న షారూఖ్‌… ఇన్ని రోజులు ఏక‌ధాటిగా షూటింగ్ చేస్తూ, హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎప్పుడూ ఉండింది లేదు. దీంతో రిలాక్సేష‌న్ కోసం షారూఖ్ రాత్రివేళ‌ల్లో బైక్‌తో షికార్లు చేస్తున్నాడ‌ని స‌మాచారం. ఇప్పటికే షారూఖ్ అండ్ కో షూటింగ్ గ్యాప్‌ల‌లో బ్యాడ్మింట‌న్ వంటి ఆట‌ల‌తో రిలాక్సవుతున్నారు. 

వ్యక్తిగ‌తంగా బైక్ రైడింగ్‌ని ఇష్టప‌డే షారూఖ్‌… స‌ర‌దాకి ఆజ్యం పోసిన‌ట్టు దిల్‌వాలే ద‌ర్శ‌కుడు రోహిత్‌శెట్టి త‌న హీరోకి హార్లీ డేవిడ్సన్ బైక్‌ని కొని బ‌హుమ‌తిగా ఇచ్చాడ‌ట‌. దీంతో ఆ బైక్ మీద తిర‌గాల‌నే ముచ్చట తీర్చుకోకుండా ఉండ‌లేక‌, రోడ్ల మీద ఎవ‌రూ గుర్తు ప‌ట్టకుండా త‌గిన జాగ్రత్తల‌తో బైక్‌పై దూసుకుపోతున్నాడ‌ట షారూఖ్‌.

ఈ విష‌యాన్ని సినిమా యూనిట్ ధృవీక‌రించ‌న‌ప్పటికీ షారూఖ్ తాజాగా చేసిన ట్వీటు మాత్రం ప‌రోక్షంగా మ‌న బాజీగ‌ర్ బైక్ రైడింగ్‌ని క‌న్ఫర్మ్ చేస్తోంది. “రాత్రి పూట షూట్స్ అంటే నాకు ఇష్టం. అంతేకాదు ఆ  స‌మ‌యంలో బైక్ మీద షూటింగ్ స్పాట్‌కి వెళ్లడ‌మంటే మ‌రీ ఇష్టం. అలాంటి రైడ్ నా మైండ్‌ను రిలాక్స్ చేస్తుంది. నా హెయిర్‌ను కూడా ఫ్రీగా మారుస్తుంది” అంటూ ట్వీట్ చేశాడు షారూఖ్‌. ఇది బాలీవుడ్ బాద్‌షా హైద‌రాబాద్ రోడ్లపై బైక్ మీద స‌వారీ చేస్తున్నాడ‌నడానికి మ‌రింత బ‌లం చేకూరుస్తోంది.