తెలుగు ప్రేక్షకులకు అల్లు శిరీష్ అద్భుతమైన సూచన చేసారు. సమీక్షలు చదవకండి, ఎవరి మాటలు వినకండి.నేరుగావెళ్లి బాహుబలి అనే అద్భుతాన్ని చూసేయండి…ఇదీ ఆయన మాట. అంటే సినిమా ఎలా వున్నా, బాగున్నా, లేకున్నా, డబ్బులు పట్టుకెళ్లి ఇచ్చేయాలన్నమాట ప్రేక్షకులు.
పొరపాటున సమీక్షలు చదివి, ఇది తమ అభిరుచికి సరిపోతుందో, సరిపోదో అని డిసైడ్ చేసుకోకూడదు. అల్లు శిరీష్ కు ఆ సినిమా అధ్భుతం అనిపించింది కాబట్టి, ఇక ఎవ్వరూ సమీక్షలు చదవకూడదు.
సినిమా మీద అభిమానం వుండొచ్చు..చూడమని చెప్పడంలో తప్పు కాదు..కానీ ఎవ్వరి మాటా వినకండి..సమీక్షలు చదవకండి అని చెప్పడం సరికాదు. సమీక్షలు, ఇతరుల మాటలు ఎలా వున్నా, ఓసారివెళ్లి చూడండి అని చెప్పచ్చు. మరీ కావాలంటే. అయినా ఇంకా గట్టిగా రెండు సినిమాల వయసురాకుండానే సమీక్షలంటే అంత అలెర్జీ వచ్చిందేమిటో శిరీష్ కు.