సమంత లెగ్గు పని చెయ్యలే

‘గబ్బర్‌సింగ్‌’ హీరోయిన్‌ శృతిహాసన్‌ని ఐరెన్‌లెగ్‌ అంటే హరీష్‌ శంకర్‌ అప్పట్లో మీడియా మీద ఫైర్‌ అయిపోయాడు. ఆ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత శృతి గోల్డెన్‌ లెగ్‌ అని కితాబిచ్చాడు. శృతి బ్యాడ్‌…

‘గబ్బర్‌సింగ్‌’ హీరోయిన్‌ శృతిహాసన్‌ని ఐరెన్‌లెగ్‌ అంటే హరీష్‌ శంకర్‌ అప్పట్లో మీడియా మీద ఫైర్‌ అయిపోయాడు. ఆ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత శృతి గోల్డెన్‌ లెగ్‌ అని కితాబిచ్చాడు. శృతి బ్యాడ్‌ టైమ్‌ ఎండ్‌ అయి గుడ్‌ టైమ్‌ స్టార్ట్‌ అవడానికి కారణమైన హరీష్‌ శంకర్‌ ఇప్పుడు తన తాజా చిత్రంతో సమంత ట్రాక్‌ రికార్డ్‌ని ఎఫెక్ట్‌ చేశాడు. 

ఇంతవరకు సమంత నటించిన భారీ చిత్రాలన్నీ కూడా భారీ విజయాలు సాధించాయి. చిన్న బడ్జెట్‌ సినిమాలు మినహాయిస్తే సమంతకి హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ రికార్డ్‌ ఉంది. ఈ ఏడాదిలోనే ఆమె అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులాంటి ఘన విజయాల్ని అందుకుంది. అయితే ఆమెకి తొలి షాక్‌ ‘రామయ్యా వస్తావయ్యా’తో తగిలింది. 

ఈ చిత్రానికి వినిపిస్తున్న టాక్‌ కానీ, డ్రాప్‌ అవుతున్న కలెక్షన్స్‌ కానీ ‘రామయ్య’ సేఫ్‌గా గట్టెక్కుతాడనే దానిపై అనుమానాలు కలిగిస్తున్నాయి. దీంతో సమంతకి కూడా ఫస్ట్‌ బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌ వచ్చినట్టే. ఎటో వెళ్లిపోయింది మనసు, జబర్దస్త్‌ చిత్రాలతో ఆమెకి పరాజయాలు ఎదురయ్యాయి కానీ బృందావనం నుంచి అత్తారింటికి దారేది వరకు ఆమె నటించిన పెద్ద సినిమాలేవీ ఫెయిల్‌ కాలేదు.