సన్నాఫ్ సత్యమూర్తి విడుదల తేదీపై రకరకాల కబుర్లు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ కోసం ఫ్యామిలీ జనాల కోసం సత్యమూర్తి సినిమాను ఓ వారం వాయిదా వేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది వాస్తవం. అయితే దర్శకుడు త్రివిక్రమ్ అంత ఆసక్తికరంగా లేడని టాక్.
ఆయన మాత్రం సినిమాను మాగ్జిమమ్ ఫినిష్ చేసేసాడట. బన్నీ డబ్బింగ్ కూడా అయిపోయిందట. ఏప్రిల్ ఒకటిన ప్రీమియర్ కూడా వేయాలని ఆలోచన చేస్తున్నారట. మరోపక్క సాయి ధరమ్ తేజ వ్యవహారాలన్నీ పవన్ చూస్తున్నారన్నది వాస్తవం. దాన్ని సాయే చెబుతున్నారు కూడా. ఇప్పుడు అలాంటి సాయి కోసం సినిమా విడుదల వాయిదా వేయకుంటే, పవర్ ఫ్యాన్ ఏమని ఫీలవుతారో.
పైగా ఆ సినిమాలో పవనిజం పాట కూడా వుంది.వీటికి తోడు మొన్నటికి మొన్న బన్నీ తనకు మెగాస్టార్ చిరంజీవి తరువాతే ఎవరైనా అని కుండ బద్దలు కొట్టాడు. పోనీ ఆ తరువాత అయినా ఆ స్పీచ్లో పవర్ స్టార్ ప్రస్తావన తేలేదు. దీనిపై ఇప్పటికే పవర్ స్టార్ అభిమానులు గుర్రుగా వున్నారని టాక్. ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడకుండా 2నే వస్తే, ఇంకెలా వుంటుందో అసంతృప్తి.
కానీ కొసమెరుపు ఏమిటంటే, సత్యమూర్తి వాయిదా పడిన తేదీకే చాలా చోట్ల బెనిఫిట్ షోకి థియేటర్లు బుక్ చేయడం, ఫ్యాన్స్ కు టిక్కెట్లు అమ్మడం జరిగిపోతుండడం.