రామ్ చరణ్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో దానయ్య నిర్మిస్తున్న సినిమాకు సంగీతం దర్శకుడు అనిరుధ్ ను ఫ్రెండ్లీ డిస్కషన్ తో తప్పించేసిన సంగతి తెలిసిందే. టైమ్ సరిపోకపోవడం, ట్యూన్లు మన జనాల టేస్ట్ కు నప్పవని భావించడం ఇందకు కారణాలుగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు అనిరుథ్ ప్లేస్ లో థమన్ వచ్చి చేరాడు.
శ్రీనువైట్లతో ఇప్పటికే థమన్ మూడు సినిమాలు వరుసగా చేసాడు. ఇది నాలుగో సినిమా అవుతుంది. రామ్ చరణ్ తో నాయక్ తరువాత చేస్తున్న రెండో సినిమా ఇది. సినిమాను అత్యంత వేగంగా తీయాలనే కోరిక కారణంగా థమన్ ను ఎంపిక చేసారు.
ఎందుకంటే ఇప్పుడున్న టాప్ మ్యూజిషియన్లలో స్పీడ్ గా స్వరాలు ఇచ్చేది థమనే. ఆఫ్ కోర్స్ రొటీన్ ట్యూన్లు ఇస్తాడనే అపవాదు కూడా వుందనుకోండి.