జులాయిలో ప్రమోషనల్ సాంగ్‌తో అదరగొట్టారు బన్నీ – దేవిశ్రీ ప్రసాద్. పకడో పకడో అంటూ ఓ గీతాన్ని తెరకెక్కించి.. ప్రమోషన్లలో దాన్ని బాగా వాడుకొన్నారు. ఇప్పుడు అదే తరహాలో సన్నాఫ్ సత్యమూర్తి కోసం ఓ గీతాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది.
బన్నీ, దేవిశ్రీ, సమంత, ఉపేంద్ర, నిత్యమీనన్‌లతో ఓ పాటని షూట్ చేసి – పబ్లిసిటీ కోసం వాడుకొంటారట. ఒకట్రెండు రోజుల్లో ఈ పాటని కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ ఆఘమేఘాలమీద సన్నాహాలు చేస్తున్నారట. మొత్తమ్మీద అటు అత్తారింటికి దారేది కథతో, ఇటు జులాయి కాన్సెప్టుతో మళ్లీ ఓ హిట్టు కొట్టాలని త్రివిక్రమ్ ప్రయత్నాలు ముమ్మరం చేశాడన్నమాట.