సుందర్ పాండ్యన్..ఏనాటి సినిమా..అంటే ఈ జెనరేషన్ లెక్కల ప్రకారం చూసుకుంటే. సునీల్ దగ్గర మొదలుపెట్టి రవితేజ, అల్లరి నరేష్ మీదుగా ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గర ఆగింది. అయితే కాస్త కామెడీ టచ్ వున్న సినిమా ఇది.
ఇప్పుడు ఎవరూ సరిగ్గా సెట్ కాక దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు చివరకు బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరకు చేరాడు. అయితే ఈ కథ శ్రీనివాస్ బాడీ లాంగ్వేజ్ కు సూట్ అవుతుందా అని అనుమానం.అందుకే అందుకు తగ్గట్లు మార్పులు చేసే పనిలో పడ్డారట.
పైగా ఈ సినిమా చాలా లేట్ కావడంతో తొలుత హక్కులలో భాగస్వామ్యం వున్న రంజిత్ మూవీస్, వివేక్ వాటిని పూర్తిగా భీమినేనికే వదిలేసారట. అందువల్ల ఇప్పుడు భీమినేని ఈ తమిళ కథను బెల్లంకొండకు తగినట్లు మార్పులు చేసి, సెట్ మీదకు తీసుకేళ్లే పనిలో బిజీగా వున్నారట.