శ్వేత చేసిన తప్పేంటి.. తన కుటుంబం కోసం ఆమె ఆ పని చేసి వుంటుందేమో.. ఆమె బాధను అర్థం చేసుకోవాలెవరైనా.. ఆ ఘటనలో ఆమెనొక్కద్దాన్నే ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి, ‘అతడ్ని’ ఎందుకు హైడ్ చేస్తున్నారు.? అని ప్రశ్నించింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పాడుకొనే, శ్వేతాబసు ప్రసాద్ ఉదంతంపై స్పందిస్తూ.
ఈ పరిస్థితుల్లో శ్వేతా బసు ప్రసాద్‌కి అందరూ అండగా వుండాలనీ.. ఆమె ఆ కూపంలోంచి బయటకు వచ్చి, నటిగా తన సత్తా చాటుకునేందుకు అవకాశమివ్వాలనీ, మానసికంగా ధైర్యాన్ని ఆమెకు అందరూ ఇవ్వాలనీ దీపికా పడుకొనే వ్యాఖ్యానించింది. ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్, బాల నటిగా బాలీవుడ్ తెరకు పరిచయమైంది. ఆమెకు ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంఘీభావం తెలిపారు.
హన్సాల్ మెహతా అనే దర్శకుడు, తన సినిమాలో శ్వేతా బసు ప్రసాద్‌కి అవకాశం కలిస్తామని ప్రకటించిన విషయం విదితమే. మిగతావారి మద్దతెలా వున్నా, దీపిక వ్యాఖ్యలు మాత్రం అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. సాటి మహిళగా శ్వేతా బసు ప్రసాద్‌కి సంఫీుభావం తెలపడం ద్వారా హేట్సాఫ్ అన్పించుకుంది దీపికా పడుకొనే.