ఈవారం మూడు సినిమాలు విడుదలైతే, టాక్ సంగతి పక్కనపెడితే మూడింటికీ కూడా ఎక్కడా మల్టీఫ్లెక్స్ ల్లో కలెక్షన్లు లేవు విశాఖ, విజయవాడ,హైదరాబాద్ ల్లొని మల్టీ ఫ్లెక్స్ లు సినిమాకు వచ్చే ఆదరణ ను బట్టి స్క్రీన్ లు కేటాయిస్తాయి. ప్రస్తుతం యమలీల 2, రఫ్, అలా ఎలా సినిమాలు రెండేసి షోలు కేటాయించాయి. కానీ అవే ఫుల్ కావడం లేదు.
మామూలు థియేటర్లలో మాత్రం కాస్త కలెక్షన్లు వుంటున్నాయి. అది కూడా థర్టీ పర్సంట్ కూడా వుండడం లేదు. రఫ్, యమలీల 2 సినిమాల కలెక్షన్లు సోమవారం నుంచే పడిపోయినట్లు తెలుస్తోంది. పావలా, ముఫై శాతం కలెక్షన్ల కాస్త 'అలా ఎలా' కే వున్నాయి. కానీ దానికి ఎక్కువ థియేటర్లు దొరకలేదు. యమలీల2 దాదాపు నాలుగు వందల థియేటర్లలో విడుదలైంది.
యమలీల 2 సినిమా మొత్తం స్వంతంగా విడుదల కావడం విశేషం. సినిమాకు ఇరవై కోట్ల వరకు ఖర్చు చేసారని అంటున్నారు. తొలి మొడు రోజులు అయిదు కోట్లకు పైగా వచ్చినట్లు బోగట్టా. ఫ్యామిలీ సినిమా కాబట్టి శాటిలైట్ వుంటుంది. అంటే మొత్తం మీద లాంగ్ లో చూసుకున్నా పది పన్నెండు కోట్ల కు మించి గెయిన్ చేయడం కష్టం కావచ్చు.
ఇక రఫ్ ముందునుంచీ సిక్ ప్రాజెక్టు. బాగా డిలే అయింది. ఇప్పుడు తొలి మూడు రోజులు కలెక్షన్లు బాగానేవున్నా, మండే డ్రాపయ్యాయి. రకుల్ ప్రీత్ సింగ్ వుండడం ఈ సినిమాకు కాస్త అడ్వాంటేజ్ గా మారింది.
ఇదిలా వుంటే ఈవారం విడుదలైన సినిమాలే కాదు, ఇంతకు ముందు విడుదలైన పిల్లా నువ్వులేని జీవితం, రౌడీ ఫెలో సినిమాలకు కూడా కలెక్షన్లు అంతంత మాత్రంగానే వున్నాయి.ఇలాంటి నేపథ్యంలో ఈవారం మరో నాలుగైదు సినిమాలు వచ్చి పడుతున్నాయి.