లింగా…చాలా గ్యాప్ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ఫుల్ లెంగ్త్, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా. ఈ సినిమా నిర్మించే లక్ వచ్చిపడింది నిర్మాత రాక్ లైన్ వెంకటేష్. ఆయన చాలా కాలుక్యులేటెడ్ నిర్మాత. వృధా ఖర్చులు అన్నవి దగ్గరకు రానీయరు. పవర్ సినిమా కు మార్జిన్ లో గట్టేకేశారు. ఇప్పుడు లింగా సినిమాతో చాలా ధీమాగా వున్నారని వినికిడి. ఈ సినిమాకు అంతంతమాత్రం ప్రచారం చాలు. రజనీ పేరే పెద్ద పబ్లిసిటీ.
ఆయన ఫొటో అలా విడుదల చేస్తే చాలు మీడియా ఇలా క్యాచ్ చేసి అక్కున పెట్టుకుంటుంది అని అంటున్నారట దగ్గరవారితో. అందువల్ల ఇక సినిమాకు పెద్దగా పబ్లిసిటీ ఖర్చు వుండదని ఆయన ధీమా. ఒక వేళ సినిమా పొరపాటునో, గ్రహపాటునో అటు ఇటు అయినా తనకు వచ్చిన నష్టమేముంటుందని, సినిమా బిజినెస్ ఎప్పుడో పూర్తయిందని అంటున్నారట. మొత్తానికి కన్నడ రంగం నుంచి తమిళనాట పెద్ద సినిమా నిర్మించి, ఆల్ ఇండియా మార్కెట్ కొట్టేసారు రాక్ లైన్ వెంకటేష్.