మళ్లీ అదే స్టయిలా..ముకుందా?

ముకుంద సాంగ్ టీజర్ విడుదలైంది. వరుణ్ తేజ్ మీద అభిమానులు హోప్ మరింత పెరిగింది. మెగా గ్రూప్ నుంచి మరో స్టార్ వస్తాడని వారు చాలా ఆశగా వున్నారు. లుక్, డ్యాన్స్ అన్నీ ఓకె.…

ముకుంద సాంగ్ టీజర్ విడుదలైంది. వరుణ్ తేజ్ మీద అభిమానులు హోప్ మరింత పెరిగింది. మెగా గ్రూప్ నుంచి మరో స్టార్ వస్తాడని వారు చాలా ఆశగా వున్నారు. లుక్, డ్యాన్స్ అన్నీ ఓకె. ఇదంతా వరుణ్ తేజ సైడ్ నుంచి. 

ఇక దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ సైడ్ నుంచి చూస్తే, టీజర్ కు సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు లో ఇద్దరు హీరోల మీద క్రియేట్ చేసిన డ్యూయట్ కు కాస్త పోలికలు కనిపిస్తున్నాయి. అందులోనూ  వెంకీ మీద స్లోగా ప్రారంభమై, మహేష్ దగ్గరకు వచ్చేసరికి బీట్, స్పీడందుకుంటుంది ట్యూన్. ఇక్కడా అలాగే వుంది. 

Watch Varun Tej's Mukunda Movie Song Teaser 

ముందు స్లోగా ప్రారంభమై, ఆ తరువాత స్టెప్స్ వైనం అదే విధంగా సాగింది. అయితే అడ్డాల శ్రీకాంత్ దగ్గర ఓ సంగతి మెచ్చుకోవచ్చు. హీరో(ల) ఇంట్రడక్షన్ సాంగ్ అయినా కాస్త మీనింగ్ ఫుల్ గా వుండేలా, పదాలు వినిపించేలా చూసుకుంటారు. హీరో ఎలివేషన్ సాంగ్ కదా అని ఎదో స్కోత్కర్షతో నింపేయరు. 

అందువల్ల ఈ సినిమాకూడా ఆయన స్టయిల్ లోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది కాబట్టి అభిమానుల అంచనాలు ఈ టీజర్ తో రెట్టింపు కావడం ఖాయం.