తెలుగు వైపు కూడా దృష్టి పెట్టాలి

కేంద్ర సెన్సారు కొన్ని ఇంగ్లీషు బూతు పదాలను సినిమాల్లో వాడడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాస్త మంచి విషయమే. సినిమాల్లో మితిమీరిన అశ్లీలత, జుగుప్స, హింస ద్వందార్థాలు పెరిగిపోతున్నాయి. సెన్సారు నిబంధనలను సక్రమంగా…

కేంద్ర సెన్సారు కొన్ని ఇంగ్లీషు బూతు పదాలను సినిమాల్లో వాడడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాస్త మంచి విషయమే. సినిమాల్లో మితిమీరిన అశ్లీలత, జుగుప్స, హింస ద్వందార్థాలు పెరిగిపోతున్నాయి. సెన్సారు నిబంధనలను సక్రమంగా సవరించి, గట్టిగా అమలు చేయాల్సి వుంది. 

ఎ సర్టిఫికెట్ వద్దు, కావాలంటే యు/ఎ ఇచ్చుకోండి అన్న ధోరణి పెరిగింది. దాని కోసం మేనేజ్ మెంట్ వ్యవహారాలు కూడా నడుస్తున్నాయని వార్తలు వినివస్తున్నాయి. ఆ సంగతి అలా వుంచితే, దొబ్బేయ్..దొబ్బేసాడు..నీవెంకమ్మ..నీ అబ్బ..ఉచ్చ పోయిస్తా..లాంటి నానా పదాలు రాజ్యమేలుతున్నాయి. 

ఇక ద్వందార్థాల విషయం చెప్పనక్కరే లేదు. అందువల్ల తెలుగు సెన్సారు విషయాలపై కూడా దృష్టి పెట్టాల్సి వుంది. ప్రతి దానికీ యు/ఎ ఇచ్చుకుంటూ పోవడం కన్నా, మితిమీరిన వ్యవహారాలున్న సినిమాలకు కచ్చితంగా ఎ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం వుంది.