సినిమా వాళ్లకు సెంటిమెంట్లు జాస్తి. ఎక్కడ కాంప్రమైజ్ అయినా సెంటిమెంట్ల విషయంలో అస్సలు అవ్వరు. టెంపర్ విషయంలో పూరి జగన్నాథ్‌కీ ఓ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యింది. ఏం మాయ చేశావె, బిజినెస్ మేన్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు పూరి. ఆరెండు సినిమలూ హిట్టయ్యాయి.
ఇప్పుడు అదే సెంటిమెంట్ టెంపర్ లోనూ రిపీట్ చేశాడు పూరి. ఈ సినిమాలో పూరి ఓ చిన్న పాత్రలో తళుక్కున మెరుస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ కథ టర్న్ అవడానికి ఆ చిన్న సీనే కారణం. ఇప్పుడు ఈ సినిమాకీ భారీగా పాజిటీవ్ వైబ్ర్స్ వీస్తున్నాయి. సో… భవిష్యత్తులోనూ పూరి ఇదే సెంటిమెంట్ కొనసాగించినా ఆశ్చర్యపోనవసరం లేదు.