టెంప‌ర్‌తో పెట్టుకొంటే అంతే!

పాపం… ఏటికి ఎదురెళ్లాడు వ‌రుణ్ సందేశ్!  అస‌లే ఫ్లాపుల ప్రయాణం చేస్తున్న ఈ యంగ్ హీరో పోయి పోయి టెంపర్‌తో పెట్టుకొన్నాడు. టెంప‌ర్ 13న విడుద‌లైతే, వ‌రుణ్ సినిమా ప‌డ్డానండీ ప్రేమ‌లో మ‌రి 14న…

పాపం… ఏటికి ఎదురెళ్లాడు వ‌రుణ్ సందేశ్!  అస‌లే ఫ్లాపుల ప్రయాణం చేస్తున్న ఈ యంగ్ హీరో పోయి పోయి టెంపర్‌తో పెట్టుకొన్నాడు. టెంప‌ర్ 13న విడుద‌లైతే, వ‌రుణ్ సినిమా ప‌డ్డానండీ ప్రేమ‌లో మ‌రి 14న వ‌చ్చింది. 

వ‌రుణ్ గ‌త సినిమాలతో పోలిస్తే ఈ సినిమా బెట‌ర్ అన్న టాక్ వ‌చ్చింది. కానీ… జ‌నాలేరీ??  శ‌నివారం టెంప‌ర్ ధాటికి వ‌రుణ్ సినిమా ఖాళీగా క‌నిపించింది. ఆదివారం ఇండియా – పాక్ మ్యాచ్ తోడైంది. దాంతో రిజ‌ల్ట్ ఢ‌మాల్ అంది. ఎన్టీఆర్ సినిమాని లైట్ తీసుకొన్న ఈ కుర్రహీరో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. 

అదే ఈ సినిమా సోలోగా వ‌స్తే అంతో ఇంతో ఫ‌లితం ద‌క్కేది. క‌నీసం పెట్టుబ‌డిలో స‌గం డ‌బ్బులు వెన‌క్కి వ‌చ్చేవి. కానీ ఎన్టీఆర్‌ని త‌క్కువ అంచ‌నా వేసిన వ‌రుణ్ సినిమా… టెంప‌ర్‌తో ఢీ కొట్టి.. చిత్తయిపోయింది. పాపం.. వ‌రుణ్‌కి హిట్ ఎప్పుడు ద‌క్కుతుందో…??​